Samantha: టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంతలు ఇటీవలె తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. విడాకుల వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు గడవక ముందే విడిపోవడం అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయాడు.
విడాకుల తర్వాత చైతు సైలెంట్ అయిపోయి తన పని తాను చూసుకుంటున్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య జ్ఞాపకాలని పూర్తిగా చెరుపుకుంటూ పోతున్న సామ్.. మొన్నీ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో చైతూతో కలిసి ఉన్న ఫొటోలను తొలగించింది.
ఇక తాజాగా తన మాజీ భర్తకు ఆమె మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే.. ఇన్‌స్టాలో చైతూని అన్ ఫాలో చేసేంది. అయితే అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్ కి చేసిన అఖిల్ అక్కినేని, నాగార్జున, అమల, వెంకటేష్, ఆశ్రిత, సుశాంత్ లని మాత్రం ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సామ్‌పై ఫైర్ అవుతున్నారు.
విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించినప్పుడు ఫ్రెండ్స్‌గా ఉంటామని చెప్పావు. కానీ, ఇప్పుడు చైతుతో పరిచయమే లేనట్లు ప్రవర్తిస్తున్నావు అంటూ సామ్‌పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సామ్ అన్ ఫాలో చేసినా.. చైతు మాత్రం ఆమెను ఫాలో అవ్వడం విశేషం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!