NewsOrbit
సినిమా

ఓవర్సీస్ విజేత ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

సంక్రాంతి సినీ సంబరం వారం ముందే రిలీజ్ అయ్యింది, దాదాపు 300 కోట్ల బిజినెస్ జరుగుతుంది అనుకుంటే ట్రేడ్ వర్గాలకే షాక్ ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించే సినిమానే కరువయ్యింది. రిలీజ్ అయిన నాలుగు సినిమాలు ఒకే వర్గం ఆడియన్స్ కి కనెక్ట్ అయి వసూళ్లు నెమ్మదించి సో సో గానే ఆడుతున్నాయి. మరి ఈ సినిమాల కలెక్షన్స్ పరిస్థితి మన దగ్గర ఇలా ఉంటే ఓవర్సీస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ఉన్నా కూడా చరణ్ కొంచెం కాసులు కురిపించే ప్రయత్నం చేస్తుంటే అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది.

భాషతో సంబంధం లేకుండా ఈ సంక్రాంతికి తెలుగు తమిళ ఇండస్ట్రీల నుంచి మొత్తం అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి, అందులో నాలుగు మెయిన్ స్ట్రీమ్ హీరోల సినిమాలే కావడం విశేషం. వీటిలో తెలుగు నుంచీ ‘ఎన్టీఆర్’ ‘వినయ విధేయ రామ’ ‘ఎఫ్ 2’ సినిమాలు రాగా, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ ‘పెట్ట’ తల అజిత్ ‘విశ్వాసం’ వచ్చాయి.

ఈ ఐదు సినిమాల్లో అద్భుతాలు సృష్టించుకున్నా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కలెక్షన్స్  కాస్త నిలకడగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఇక ‘వినయ విధేయ రామ’ కు రెస్పాన్స్ డల్ గానే ఉంది. ఒకపక్క ఎన్టీఆర్ సినిమా ప్రీమియర్స్ తోనే $478K రాబడితే, భారీ అంచనాల మధ్య విడుదలైన వినయ విధేయ రామ మాత్రం $150K ని టచ్ చేయడానికి కూడా కష్టపడింది.  నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుండడంతో వసూళ్లు మరింత తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఎఫ్2’  ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్లతోనే $199K  వసూళ్లు చేసి వినయ విధేయ రామ ఓపెనింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెట్టా’ రెండు  వెర్షన్ల కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్ మార్కును దాటాయి.  రజనీ కెరీర్లో ఇది ఏడో వన్ మిలియన్ డాలర్ ఫిలిం అవ్వడం విశేషం. ఇలాంటి రికార్డు మరే ఇతర తమిళ హీరోకు కూడా లేదంటే టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్ వైపు నడిపించగలగడంలో రజినీ స్టామినా ఏంటో అర్ధమవుతుంది. ఇక తలైవాతో పోటీ పడిన అజిత్ ‘విశ్వాసం’, లోకల్ బాక్సాఫీస్ దగ్గర బాగానే రాబడుతున్నా  ఓవర్సీస్ లో మాత్రం $100k  మార్క్ కూడా టచ్ చేయలేదు.

విశ్వాసం పరిస్థితి  మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి ‘యూరి’.. ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాల కలెక్షన్స్ కూడా $100k లోపే ఉన్నాయి.  ఐదు సౌత్ సినిమాలతో పాటుగా ఈ రెండు హిందీ సినిమాల ఓవర్సీస్ కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు: $699867
వినయ విధేయ రామ: $207856
ఎఫ్ 2: $199676
పెట్టా: $1090664(తమిళ తెలుగు వెర్షన్లు కలిపి)
విశ్వాసం: $84354
యూరి: $97123
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: $38454
ఇప్పటికైతే ఈ కలెక్షన్ల వివరాలు చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ది టాక్ డబ్బులు రాబడుతున్న ఒకే సినిమా ‘పెట్ట’. సూపర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపిస్తూ ఓవర్సీస్ లో మిగిలిన సినిమాలని వెనక్కి నెడుతూ రజినీ తన పని తాను చేసుకొని పోతున్నాడు. మరి లాంగ్ రన్ లో ఎవరు నిలబడతారు? ఎవరు లాభాల బాటలో నడుస్తారు అనేది చూడాలి…

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment