ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం మూలంగా మృతులు సంఖ్య ఎక్కువ అయిపోతుంది. 2023 మొత్తం మృతులు సంఖ్య నే ఉంది. ఇక కొత్త ఏడాదిలో ఏమైనా మారుతుంది అనుకునే లోపే ఏదో ఒక విషాదం జరుగుతూ జనాలను కుదిపేస్తుంది. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూ తమ అభిమానులకి షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా మరొక సంగీత దర్శకుడు మృతి చెందినట్లు తెలుస్తుంది.
ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ చెన్నైలో కన్నుమూశారు. కన్నడ, తమిళ్, తెలుగు సినిమాలకు సంగీతం అందించిన ఈయన 71 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇళయరాజా వంటి పెద్ద సంగీత దర్శకుడిని పోటీని ఎదుర్కొన్న విజయ్ ఆనంద్ కన్నడ చిత్ర పరిశ్రమలో 100 సినిమాలకు పైగా సంగీతం అందించి అక్కడ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ” నాన్ అడిమై ఇల్లై ” సినిమా విజయ్ కి మంచి పేరు దక్కించింది.
ఈ సినిమా అనంతరం ఈయనకి అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి. తమిళ్లో పది సినిమాలకు విజయ్ సంగీతం అందించారు. ఇక ఈయన మృతి పై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఈయన అభిమానులు కుప్ప కూలిపోయారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!