Srimukhi: మన బుల్లితెర యాంకర్లలో అత్యధిక పాపులారిటీ ఉన్న వారిలో శ్రీముఖి ఒకరు. సుమా కనకాల తరువాత బెస్ట్ యాంకర్లు ఇంకెవరైనా ఉన్నారా అంటే ముందుగా శ్రీముఖి పేరే వినబడుతుంది. ఈ ముద్దుగుమ్మ కి కెరీర్ మొదట్లో పెద్దగా షోలకి యాంకరింగ్ చేసే అవకాశాలు రాకపోయినా… ప్రస్తుతం మాత్రం ఇటు యాంకరింగ్ తో పాటు మరో పక్క సినిమాలలో కూడా రాణిస్తూ దూసుకుపోతుంది.
ఈమెకి బిగ్ బాస్ షో కి వెళ్లిన అనంతరమే ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అంతకుముందు పెద్దగా శ్రీముఖి అంటే ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్ అనంతరం మాత్రం శ్రీముఖిని ఓ స్టార్ హీరోయిన్ ని చూసినట్లు చూస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి మంచి పాపులారిటీ దక్కించుకున్న రాహుల్ సిప్లిగంజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒక్క పాటతో పాన్ ఇండియా సింగర్ అయిపోయాడు రాహుల్ సిప్లిగంజ్. ఇక ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో ” సూపర్ సింగర్ ష అనే ఓ రియాల్టీ షోకు హోస్టింగ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ వీక్ సింగర్స్ అంతా రెట్రో నేపథ్యంలో సాంగ్స్ పాడుతున్నారు.
ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, శ్రీముఖి తో డాన్స్ చేస్తూ.. సైగ చేశాడు. దీంతో తను స్పందించి. ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నాను. కానీ నేను మీతో లవ్ లో లేను.. నేను రాహుల్ తో ప్రేమలో ఉన్నాను.. అంటూ శ్రీముఖి ఓ భారీ డైలాగ్ చెబుతుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదంతా కేవలం షో వరకే పరిమితం అయినట్లు తెలుస్తుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!