మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ .. ఈమె కథానాయికగానే కాదు స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే స్పెషల్ సాంగ్స్‌లో నటించాలంటే బాగానే ముట్టచెప్పాల్సి ఉంటుంది. ఇలా తమన్నా స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా బాగా రాబట్టుకుంటుంది. ఇప్పటికే అల్లుడుశీను, జాగ్వార్, జై లవకుశ చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. కాగా ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్‌లో నటించడానికి ఓకే చెప్పిందని వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు తమన్నా చేయబోతున్న స్పెషల్ సాంగ్ ఎందులో తెలుసా? `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో. మహేశ్, అనీల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో మహేశ్ ఇంట్రడక్షన్ సాంగ్‌లో తమన్నా కనపించనుందని సినీ వర్గాల సమాచారం. ఆగడు సినిమాలో మహేశ్ సరసన తమన్నా నటించింది. తర్వాత ఇప్పుడే నటిస్తోంది. అది కూడా స్పెషల్ సాంగ్‌లో. `సరిలేరునీకెవ్వరు` చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది.
Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!