Samantha: టాలీవుడ్లో ప్రస్తుతం సమంత టైం నడుస్తోంది. విడాకుల అనంతరం సామ్ జాతకం మారిపోయింది. అవును.. వరుస ఆఫర్లతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ఆమెకి మరింత కలిసి వచ్చింది. ఊ అంటావా మావ.. ఊహు అంటావా అంటూ సామ్ వేసిన స్టెప్పులకు తెలుగునాట కుర్రకారు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈమె యశోద సినిమాలో నటిస్తోంది. అలాగే సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
AP News: కరోనా వస్తే పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు పరుగు..! ప్రజా ప్రతినిధులు మీరు ఏమి సందేశం ఇస్తున్నారు..!?
Samantha: ఆ తమిళ స్టార్ ఇతగాడే..
తాజా సమాచారం ప్రకారం తమిళం నుంచి సమంతకు కాల్ వచ్చింది. మరెవ్వరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు అయినటువంటి కార్తీ సమంతను తన సినిమాకోసం ఎంచుకున్నారని టాక్. ఈ క్రమంలో సామ్‌తో సంప్రదింపులు జరిపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో కార్తీ.
Krithi Shetty: కృతి శెట్టిపైనే ఆశలు పెట్టుకున్న టాలీవుడ్ హీరో..హిట్ ఇస్తుందా..? ముంచేస్తుందా..?
హీరో కార్తీ కెరీర్ గ్రాఫ్ ఇదే..
సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ మొదటి సినిమా ‘యుగానికి ఒక్కడు’తోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు వరుస చిత్రాలతో అక్కడ దూసుకుపోతున్నాడు. ఇకపోతే తమిళంలోనే కాకుండా..తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవం. ఇటీవల విడుదలైన ఖైదీ సినిమా తెలుగునాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తీ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా సమంతను కోరాడట మన కుర్రోడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!