NewsOrbit
సినిమా

Lata Mangeshkar: లతాజీ పెళ్లి చేసుకోక‌పోవ‌డం వెన‌కున్న అస‌లు ర‌హ‌స్యం ఏంటో తెలుసా?

Lata Mangeshkar: దిగ్గజ గాయని, గానకోకిల, భారతరత్న లతా మంగేష్కర్‌ కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ల‌తాజీ తుదిశ్వాస విడిచారు. ఈమె మ‌ర‌ణ వార్త యావ‌త్ దేశాన్ని శోక‌సంద్రంలోకి నెట్టేసింది. ప్ర‌స్తుతం పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా ల‌తాజీ మ‌ర‌ణంపై సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రి కొద్దిసేప‌టిలో శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్య క్రియలు నిర్వహించనున్నారు. ఇక‌పోతే వృత్తిరీత్యా దేశం గర్వించే స్థాయికి ఎదిగినా ల‌తాజీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అస‌లు ఆమె వివాహం చేసుకోక‌పోవ‌డం వెన‌కున్న అస‌లు ర‌హ‌స్యం ఏంటీ..? అన్న ప్ర‌శ్న ఎంద‌రిలోనూ ఉంది. అయితే దీనికి గ‌తంలో ల‌తాజీనే స్వ‌యంగా స‌మాధానం ఇచ్చారు.

Lata Mangeshkar

ఇంత‌కీ ఆమె ఏం చెప్పారంటే..`కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం వ‌ల్ల తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ బాధ్య‌త‌లెన్నో భుజాన‌ ఉండ‌టం కారణంగా కుదరలేదు. అయినా జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి.` అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో జన్మించారు. తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ల‌తాజీ.. 1942లో గాయనిగా కెరీర్‌ ప్రారంభించారు. దాదాపు 36 భాష‌ల్లో వేలావి పాట‌లు పాడిన ఆమె.. లెక్కకు మించిన అవార్డులు, రివార్డులు దక్కించుకుని చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N