The Family Star: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా “ది ఫ్యామిలీ స్టార్”. ఏప్రిల్ 5వ తారీఖు సినిమా రిలీజ్ చేయబోతున్నారు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మెల్లమెల్లగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి “నందానందాన” అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. నెల రోజుల క్రితం విడుదలైన ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూట్యూబ్ లో వారం రోజులపాటు నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు రెండో సాంగ్ కింద “కళ్యాణి వచ్చా వచ్చా” అనే పాట విడుదల చేశారు.
గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సాంగ్ చాలా మెలోడీగా ఉంది. మూడు నిమిషాల 20 సెకండ్ల నిడవి కలిగిన ఈ సాంగ్ సంగీత శ్రోతలను ఎంతగానో అలరిస్తూ ఉంది. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ గత ఏడాది “ఖుషి” సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు “ది ఫ్యామిలీ స్టార్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల.. సినిమా ఏప్రిల్ నెలకి వాయిదా పడటం జరిగింది.
విజయ్ దేవరకొండకి “గీతా గోవిందం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు.. పరుశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామా తరహాలో సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే “ది ఫ్యామిలీ స్టార్” టీజర్ రిలీజ్ అయింది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోసారి పరుశురాం తన మార్క్ డైరెక్షన్ “ది ఫ్యామిలీ స్టార్” లో చూపించనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా సెకండ్ సాంగ్ “కళ్యాణి వచ్చా వచ్చా” కూడా అభిమానులను ఆకట్టుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తారీఖు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో “ది ఫ్యామిలీ స్టార్” రిలీజ్ చేస్తున్నారు.