NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 12 2024 Episode 182:  డ్రైవర్ దొరికాడని టెన్షన్ పడుతున్న మనోహరి, అరుంధతిని కాపాడుకోలేకపోయానని బాధపడుతున్న అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights

Nindu Noorella Saavasam March 12 2024 Episode 182: నాకు థాంక్స్ ఎందుకు చెప్తున్నారండి అని భాగమతి అడుగుతుంది.  మిస్సమ్మ ఈయన ఎందుకు థాంక్స్ చెప్తున్నాడు అని అరుంధతి అనుకుంటుంది. నాకేమీ అర్థం కావట్లేదు అండి అని భాగమతి అంటుంది. నా భార్య చావు దగ్గర ఆగిపోయిన మా ఆనందా0 మళ్లీ  నీ వల్లే  వచ్చింది మిస్సమ్మ నా పిల్లల గెలుపు నీవల్లే వచ్చింది మా అమ్మానాన్నల కళ్ళల్లో ఆనందం కనిపించింది నువ్వు వచ్చాకే నా భార్యది యాక్సిడెంట్ కాదు ప్లాన్ చేసి చంపేశారు అని తెలిసింది ఇప్పుడు నువ్వు చాకే మళ్లీ ఆరుని చంపిన వాడు నాకు దొరికాడు అని అమరేంద్ర అంటాడు.ఆ డ్రైవర్ దొరికాడు అనగానే మనోహరి గుండె మొక్కలు అయిపోతుంది. అమర్ కోడల్ని చంపిన ఆ డ్రైవర్ దొరికాడా నువ్వు చెప్పేది నిజమా అని శివరామ్ అంటాడు. అవును నాన్న వాడిని పట్టుకుని నా ఆరుని ఎందుకు చంపావని నిలదీశాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights

అతను నిజం చెప్పాడా అమర్ అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది.  అతని పట్టుకుని ఎందుకిలాంటి పని చేసావ్ ని  అడుగుతాను అని మనోహరి అంటుంది.తనలో కంగారు చూసిన భాగమతి రాథోడ్ కి సైగ చేస్తుంది. పోలీస్ స్టేషన్లో అప్పగించాను మనోహరి అతని వెలుగులో ఉంచి చీకట్లో నుంచి ఇదంతా ఎవరు జరిపించారో తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత వాళ్ళని చంపేస్తాను అని అమరేంద్ర అంటాడు.ఆ మాట విన్న మనోహరి  భయపడుతూ ఒళ్లంతా చెమటలు పడతాయి. మనోహరి గారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీ ఒళ్లంతా ఎందుకు చెమటలు పటయి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని భాగమతి అంటుంది. నాకెందుకు కంగారు ఏమీ లేదు అని మనోహరి అంటుంది.పాపం చేసిన వాళ్ళు ఎన్నాళ్ళు తప్పించుకుంటారు మనోహరి గారు ఇవ్వాళ కాకపోతే రేపైనా కళ్ళ ముందుకు వస్తారు అప్పుడు వాళ్ళ సంగతి ఉంటుంది అని  భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights

సారీ అండి మిమ్మల్ని రమ్మని మాట్లాడలేకపోయాను అని అమరేంద్ర అంటాడు. పర్వాలేదులే బాబు ఏంటో చెప్పు అని రామ్మూర్తి అంటాడు. డిన్నర్ అయ్యాక మాట్లాడుకుందాం అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. అమర్ కి నిజం తెలియకూడదు ఒకపక్క అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అనుకునే సమయానికి వాడు దొరికాడు. ఇప్పుడు వాడు కనక నోరు తెరిస్తే నా మెడలో తాళిపడమేమో కానీ ఉరితాడు పడుతుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే,ఆడ్రైవర్ ని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో వేస్తారు పోలీసులు. రేయ్ నీ మీ ఊరు ఏంట్రా ఎక్కడ నుంచి వచ్చావ్ మిల్ట్రీ వాడికి నీకు సంబంధం ఏంటి  అని సీఐ అడుగుతాడు. మాది కొడైకెనాలండి హైదరాబాదులో లోన్ తీసుకుందామని వచ్చాను అని ఆ డ్రైవర్ చెబుతాడు. వాడి భార్యని ఎందుకురా చంపేశావ్ వాడు చెప్పింది నిజమేనా నీ చేత ఎలా నిజం కక్కించాలో నాకు తెలుసు రా నీ సంగతి తర్వాత చెప్తాను రా అని సీఐ కూర్చుంటాడు. ఇంతలో సీఐ అకౌంట్ లోకి ఐదు లక్షలు మనోహరీ ట్రాన్స్ఫర్ చేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights

నాకు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అని సిఐ చూసుకొని మనోహరి కి ఫోన్ చేస్తాడు. సిఐ గారు మీ అకౌంట్ లోకి ఐదు లక్షలు వచ్చాయా అని మనోహరి అడుగుతుంది. ఏదో పొరపాటున వచ్చినట్టు ఉన్నాయండి మీ డబ్బులు మీకు కొట్టేస్తాను అని సిఐ అంటాడు.ఆ ఐదు లక్షలు మీకేనండి మీరు ఇప్పుడు తీసుకువచ్చిన డ్రైవర్ని వదిలేయాలి అని మనోహరి చెబుతుంది. అతని ఎందుకు వదిలేయాలి అని సీఐ అంటాడు. మీకు డబ్బులు కావాలా ఆన్సర్ కావాలా అని మనోహరి అడుగుతుంది. వాడు చేసిన అవమానానికి ఈ డ్రైవర్ నేనే వదిలేద్దాం అనుకున్నాను కానీ మీరే ఈలోగా ఫోన్ చేశారు వాడు కంప్లైంట్ రాసిచ్చాడు కాబట్టి ఇద ప్రాబ్లం అవుతుంది ఒక రోజు టైం ఇవ్వండి వాడిని నేనే పంపించేస్తాను అని సీఐ అంటాడు. థాంక్యూ సిఐ గారు అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights

కట్ చేస్తే, అమరేంద్ర అరుంధతి ఫోటో పట్టుకొని సారీ ఆరు పక్కనే ఉండి నేను కాపాడుకోలేకపోయాను దేశాన్ని కాపాడే నేను నిన్ను రక్షించుకోలేకపోయాను నన్ను క్షమించు అని బాధపడతాడు. అయ్యో దీంట్లో మీరు చేసింది ఏముందండి నా తలరాతలో ఇంతవరకే రాసిపెట్టి ఉందేమో మీరు మాత్రం ఏం చేస్తారు మీరు అలా బాధపడకండి అని అరుంధతి బాధపడుతుంది. అమరేంద్ర అరుంధతి ఫోటో హగ్ చేసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తనని కౌగిలించుకొని ఓదార్చాలనుకున్న అరుంధతి ముట్టుకోలేక పోతుంది. ఇంతలో పిల్లలు వచ్చి డాడీ అని అంటారు. కళ్ళ నీళ్లు తూడ్చుకున్న అమరేంద్ర మీ అమ్మని చంపిన వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాను అని చెబుతాడు. డాడీ అమ్మ ఫోటో ఒకసారి ఇస్తారా అని అంజలి అడుగుతుంది. అమరేంద్ర అరుంధతి ఫోటోని ఇస్తాడు. ఫోటో తీసుకున్న అంజలి గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది. మిగతా ముగ్గురు కూడా అంజలిని పట్టుకొని బాధపడతారు. అమ్మ నువ్వు ఏమీ బాధపడకు మిస్సమ్మ మమ్మల్ని బాగానే చూసుకుంటుంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండమ్మా అని అంజలి అంటుంది.అమ్మ చుట్టూఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు తెలుస్తుంది అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 12 2024 Episode 182 highlights

డాడీ స్టేషన్ కి వెళ్లి అమ్మని చంపిన డ్రైవర్ని ఒక్కసారి చూడొచ్చా అని అంజలి అడుగుతుంది. ఎందుకు అంజలి అని అమరేంద్ర అంటాడు. ప్లీజ్ డాడీ ఒక్కసారి చూడొచ్చా అని అంజలి అంటుంది. అలాగే అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, ఏంటి సార్ ఇక్కడే నిలబడ్డారు సార్ ని కలుస్తాననరు వెళ్ళండి అని రాథోడ్ అంటాడు. అంటే ఆయన గదిలోకి వెళ్ళొచ్చో లేదో అని నిలబడ్డాను అని రామ్మూర్తి అంటాడు. ఆయన మనసులోనే స్థానం ఇచ్చాడు మీరు రూమ్ లోకి వెళ్ళడానికి మొహమాట పడతారు ఎందుకు సార్ వెళ్ళండి అని రాథోడ్ అంటాడు. రామ్మూర్తి తన గదిలోకి వస్తాడు. రండి అక్కడే నిలబడిపోయారే అని అమరేంద్ర అంటాడు. అంటే బాబు ఏదో మాట్లాడాలన్నారు కదా అడుగుదామని వచ్చాను అని రామ్మూర్తి అంటాడు. డిన్నర్ చేసాక మాట్లాడుకుందాం అన్నాను కదా అండి మీరు అర్జెంటుగా వెళ్లాలా ఏమైనా పనులు ఉన్నాయా అని అమరేంద్ర అంటాడు. అబ్బే నాకేం పనులు ఉన్నాయి బాబు ఏమీ లేవు అని రామ్మూర్తి అంటాడు. తాతయ్య మా అమ్మ గురించి చెప్పినప్పుడు మా అమ్మని చూపించమన్నారుగా చూస్తారా అని అంజలి అడుగుతుంది. చూస్తా అమ్మ అని రా మూర్తి అంటాడు. అంజలి తీసుకువెళ్లి అరుంధతి ఫోటో రామ్మూర్తికి ఇస్తుంది. అది చూసిన రామ్మూర్తి అమ్మ అని పిలుస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella