మెగాస్టార్ చిరంజీవి.. భారత సినీ పరిశ్రమకు పరిచయమక్కరలేని పేరు. ఎందుకంటే సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటన, స్వయం కృషితో “మెగాస్టార్”గా ఎదిగారు. అయితే, ఆ మధ్య కొంత కాలం సినిమాలను వదిలిపెట్టి.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. “ప్రజారాజ్యం” పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అనుకున్నంత విజయం సాధించలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన వెండితెరపై “ఖైదీ” సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది తమిళంలో మంచి విజయం సాధించిన “కత్తి” సినిమాకు రీమేక్. అయినప్పటికీ.. చాలా గ్యాప్ తర్వతా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆ సినిమాను బాగానే ఆదరించారు. ఆ తర్వాత చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ… మెగాస్టార్ హీరోగా “సైరా” సినిమాను తీశాడు. ఈ సినిమాలో చిరు.. తన స్టామినా ఇప్పటికీ తగ్గలేదనే రీతిలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడు ఆ చిత్రంలో. దీంతో తాజాగా ఆయన నటిస్తున్న “ఆచార్య” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, చిరు కొంత గ్యాప్ తీసుకుని వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలపై అభిమానులతో పాటు సినీ వర్గాలు, ప్రేక్షకులు పెదవి విరుచుతున్నారు. అసలు చిరుకు ఎమైంది? ఎందుకలా చెస్తున్నాడని? అనుకుంటున్నారు. దేని గురించి అనుకుంటున్నారా? అదే నండీ… చిరు స్ట్రెయిట్ మూవీస్ కాకుండా.. రీమేక్‌లపై ఆసక్తి చూపించడం..! అభిమానులతో పాటు అందరికీ అసంతృప్తి కలిగిస్తున్నదని టాక్ వినిపిస్తున్నది.
కత్తి రీమేక్‌తో రీఎంట్రీ ఇచ్చిన చిరు.. తమిళ హిట్ మూవీ “వేదాళం”, మలయాళి బ్లాక్‌బస్టర్ “లూసిఫర్” చిత్రాలను సైతం ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే, భాషతో సంబంధం లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులు సినిమాలను చూసేస్తున్నారు. ఇలాంటి తరుణంతో ఒకే విధమైన స్టోరీ లైనప్‌తో కూడిన సినిమాలను చేయడానికి నిర్ణయించుకుంటుండటంతో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికి ప్రస్తుత రీమేక్ లు సరిపోవట్టు తాజాగా మరో తమిళ సినిమా “ఎన్నై అరిందాలు”ను రీమేక్ చేయడానికి చిరు ఆసక్తి చూపుతున్నాడని టాక్. దీంతో చిరంజీవికి ఎమైందసలు? ఎందుకిలా? అని ప్రేక్షకుల టాక్ నడుస్తున్నది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!