Mukku Avinash : గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ముక్కు అవినాష్ Mukku Avinash కన్నా.. బిగ్ బాస్ అవినాష్ గా ఇఫ్పుడు అందరికీ సుపరిచితం అయ్యాడు అవినాష్. జబర్దస్త్ నుంచి తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. అంచెలు అంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలుగులోనే టాప్ కమెడియన్ గా తనకంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు అవినాష్.
బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు అవినాష్ చేసిన ఎంటర్ టైన్ మెంట్ కు జనాలు కూడా ఫిదా అయిపోయారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునే అవినాష్ ను మెచ్చుకొని.. బిగ్ బాస్ 4 ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు. అది ముక్కు అవినాష్ అంటే. సాయికుమార్ ను బాగా ఇమిటేట్ చేయగల సత్తా ఉన్న అవినాష్ కు ప్రస్తుతం సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. తాజాగా స్టార్ మాలో వస్తున్న కామెడీ స్టార్స్ కామెడీ ప్రోగ్రామ్ లో టీమ్ లీడర్ గా చేస్తూనే పలు షోలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు ముక్కు అవినాష్
Zombie Reddy ఇంటర్వ్యూలో Mukku Avinash ను ఆడుకున్న జబర్దస్త్ టీం
ఇక.. జబర్దస్త్ టీం అయినటువంటి ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్, గెటప్ శ్రీను.. వీళ్లంతా ముక్కు అవినాష్ తో కలిసి త్వరలో తెలుగులో రిలీజ్ కాబోతున్న జాంబి రెడ్డి సినిమా టీమ్ తో ఇంటర్వ్యూ చేశారు. ఆ సినిమా ముచ్చట్లను ప్రేక్షకులకు పంచారు. ఈ ఇంటర్వ్యూలో కూడా ముక్కు అవినాష్ ను అంతా కలిసి ఆడేసుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ ప్రోమోను చూసేయండి.