ఖుషీ ఖుషీగా.. తెలుగులో మొట్టమొదటి సారి ప్రారంభమైన స్టాండప్ కామెడీ షో. దీన్ని మెగా హీరో నాగబాబు యూట్యూబ్ లో తన సొంత చానెల్ లో ప్రారంభించారు. నిజానికి తెలుగులో ఇదివరకే కొన్ని చానెళ్లలో స్టాండప్ కామెడీలు ప్రారంభం అయినా అవి అంతగా సక్సెస్ కాలేదు. వేరే భాషల్లో స్టాండప్ కామెడీలతో చాలా షోలు నడుస్తున్నాయి కానీ.. తెలుగులో లేకపోవడంతో.. ప్రేక్షకులకు స్టాండప్ కామెడీని పరిచయం చేయడం కోసం నాగబాబు ముందడుగు వేసి చేసిన ప్రయత్నం ఇది.

అయితే.. ముందు ఈ షో సక్సెస్ అవుతుందా? లేదా? అన్న మీమాంశలో నాగబాబు ఉండేవారు. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ ను రిలీజ్ చేయడం, యూట్యూబ్ లో ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో పాటు.. వ్యూస్ లో కూడా ఈ షో దూసుకుపోతోంది.
దీంతో.. తాజాగా ఎపిసోడ్ 4కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ షో కోసం ముందే ఆడిషన్స్ నిర్వహించారు. వెయ్యికి పైగా ఆడిషన్స్ రాగా.. 30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో కొందరు కొత్తవాళ్లు ఉన్నారు. మరికొందరు ఇప్పటికే కొన్ని కామెడీ షోలలో, స్టాండప్ కామెడీలు చేసిన వాళ్లు ఉన్నారు.
ఇక.. ఈ షోకు జడ్జిలుగా నాగబాబు, కమెడియన్ వేణు వ్యవహరిస్తున్నారు. ఇక.. నాలుగో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.