Tuck jagadeesh : లాస్ట్ ఇయర్ నుంచి కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద తీవ్రంగా ప్రభావం చూపించింది. దాంతో హీరోల కెరీర్ కూడా కాస్త స్లో అయింది. మీడియం బడ్జెట్ సినిమాల నుంచి పాన్ ఇండియన్ సినిమాల వరకు అన్నీ ఆగిపోయాయి. ఆ సినిమాల రీ షెడ్యూల్ కూడా పెద్ద వ్యవహారమే. అందుకే ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ చేసేందుకు డైలమా నెలకొంది. దాంతో కొన్ని సినిమాలు గత ఏడాది నుంచి ల్యాబ్ లోనే ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు ఛాన్స్ దొరికితే రిలీజ్ చేయనున్నారు. 50% సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నా రిలీజ్ చేస్తూ వచ్చారు. అలా క్రాక్, రెడ్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ అయితే భారీ స్థాయిలో మళ్ళీ జనాలు థియేటర్స్ కి వచ్చారు. భారీ కమర్షియల్ హిట్ అని అందరూ భావించారు. వసూళ్ళు కూడా భారీగా సాధించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి అనుకున్న హిట్ వకీల్ సాబ్ సాధించలేకపోయింది. ఇక 100% అక్యూపెన్సీ తో వారానికి నాలుగు సినిమాలకు రిలీజ్ చేశారు. కానీ అది కొన్ని వారాలకే పరిమితం అయింది. మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యేలోపు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలను లైన్ లోకి తీసుకు వస్తున్నారు.
Tuck jagadeesh : నానికి గత కొంతకాలంగా సాలీడ్ హిట్ దక్కడం లేదు.
ఇప్పటికే కొన్ని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేశారు. వాటిని కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యాక మళ్లీ రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాటిలో క్రాక్, వకీల్ సాబ్ సినిమాలున్నాయి. ఇక విరాట పర్వం, లవ్ స్టోరి, టక్ జగదీష్ ముందు రానున్నాయి. అయితే నానికి గత కొంతకాలంగా సాలీడ్ హిట్ దక్కడం లేదు. దాంతో టక్ జగదీష్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మాస్ హిట్ సాధిస్తే మళ్ళీ నాని సక్సెస్ ట్రాక్ ఎక్కి యూ టర్న్ తీసుకుంటాడని చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.