NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నెల్లూరు జిల్లా టీడీపీ క్యాండెట్లు ఫిక్స్‌.. ఆ ఇద్ద‌రికి బాబు గారి షాక్‌…!

ఏపీలో ఉమ్మ‌డి జిల్లాల వారీగా చూస్తే అధికార వైసీపీ కంచుకోట‌గా ఉన్న జిల్లాల్లో, చాలా బ‌లంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒక‌టి. అస‌లు వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ జిల్లాలో ఆ పార్టీ బ‌లంగా ఉంది. ఉప ఎన్నిక‌తో క‌లుపుకుని నెల్లూరు పార్ల‌మెంటు సీటును వైసీపీ ఏకంగా మూడు సార్లు గెలుచుకుంది. ఇక నెల్లూరులో కోవూరు, ఉద‌య‌గిరి ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ ఆ త‌ర్వాత 2014లో 10 ఎమ్మెల్యేల‌కు 7, 2019లో 10 సీట్లు స్వీప్ చేసి త‌న ప‌ట్టు నిలుపుకుంది.

అలాంటి చోట ఇప్పుడు వైసీపీ గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. ప‌లువురు బ‌ల‌మైన నేత‌లు పార్టీని వీడి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. చివ‌ర‌కు వైసీపీకి భారీగా పెట్టుబ‌డి పెట్టిన సౌమ్యుడు అయిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి లాంటి వారు సైతం ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోన్న ప‌రిస్థితి. వైసీపీలో అంతా గంద‌ర‌గోళంగా ఉంటే చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబు దూకుడు చూపిస్తున్నారు. దాదాపు పార్ల‌మెంటు సీటుతో పాటు 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో క్లారిటీతో ఉంటున్నారు.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టీడీపీ నుంచే పోటీ చేసే వారి లిస్ట్ ఇలా ఉంది…
ఉద‌య‌గిరి – కాక‌ర్ల సురేష్‌
గూడూరు – పాశం సునీల్ కుమార్‌
సూళ్లూరుపేట – నెల‌వ‌ల విజ‌య‌శ్రీ
నెల్లూరు – పొంగూరు నారాయ‌ణ‌
నెల్లూరు రూర‌ల్ – కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి
కావ‌లి – కావ్య కృష్ణారెడ్డి
కోవూరు – పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అవుట్‌.. వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి ఇన్‌
వెంక‌ట‌గిరి – కురుగొండ్ల రామ‌కృష్ణ‌
ఆత్మ‌కూరు – ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి
స‌ర్వేప‌ల్లి – సోమిరెడ్డి వార‌సుడు లేదా మ‌రో వ్య‌క్తి

పై లిస్టులో కావ‌లిలో తాజా ఇన్‌చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడును త‌ప్పించి ఆ ప్లేస్‌లో కావ్య కృష్ణారెడ్డికి సీటు ఇస్తున్నారు. కోవూరులో పోలంరెడ్డి దినేష్‌రెడ్డి సామ‌ర్థ్యంపై సందేహాలు ఉండ‌డంతో ఆ ప్లేస్‌లో ఇటీవ‌ల పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి భార్య వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిని రంగంలోకి దింప‌డం ఖ‌రారైంది. ఇక నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీలో ఉంటారు.

మాజీ మంత్రి ఆనం తాను ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట‌గిరి సీటు ఆశిస్తున్నా.. అక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన నేత‌, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఉండ‌డంతో ఆనంను ఆయ‌న గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన ఆత్మ‌కూరుకు పంప‌నున్నారు. నెల్లూరు రూర‌ల్ నుంచి పార్టీ మారిన కోటంరెడ్డి పోటీ చేస్తుంటే, సిటీలో మాజీ మంత్రి నారాయ‌ణ‌లో పోటీలో ఉంటున్నారు. గూడురులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పోటీ చేస్తున్నారు.

అయితే కోవూరులో పోలంరెడ్డి ఫ్యామిలీకి షాక్ ఇస్తోన్న చంద్ర‌బ‌బు… స‌ర్వేప‌ల్లిలో సీనియ‌ర్ నేత సోమిరెడ్డి ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ సోమిరెడ్డి వ‌రుస‌గా ఐదుసార్లు ఓడిపోతూ వ‌స్తున్నారు. ఈ సారి కోవూరు, స‌ర్వేప‌ల్లిలో బాబు మార్క్ షాకింగ్ డెసిష‌న్లు ఉంటాయంటున్నారు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju