Categories: న్యూస్

New Labour Law: కార్మికులకు వారానికి మూడు రోజులు సెలవు..కానీ ..

Share

New Labour Law: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలు నిన్నటి నుండి అమలులోకి వచ్చాయి. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చట్టాలు జూలై 1 నుండి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం  ఉద్యోగుల వేతనం, పీఎం కంట్రిబ్యూషన్, పని సమయం, వీక్లీ ఆఫ్ లు వంటి వాటిలో పలు మార్పులు ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం నాలుగు రోజులు పని చేయాలి. మూడు రోజులు సెలవు తీసుకోవచ్చు. అయితే రోజు వారి పని సమయం 12 గంటలకు పెరుగనుంది. ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులుగా 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాాల్సి ఉంటుంది. ఒక వేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పని చేయించుకుంటే వారంలో ఒక సెలవు మాత్రమే వస్తుంది. రోజుకు 9 గంటలు పని చేసే వారికి వారానికి రెండు వీక్లీ ఆఫ్ లు లభిస్తాయి. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 26 వారాలు తీసుకోవచ్చు. వీరి అనుమతి లేకుండా కంపెనీ నైట్ షిఫ్ట్ వేయకూడదు.

New Labour Law Weekly Three Days off

 

New Labour Law: చేతికి వచ్చే వేతనం తగ్గుతుంది

కొత్త కార్మిక చట్టం ప్రకారం మొత్తం జీతంలో బేసిక్ పే హాఫ్ ఉండాలి. అంటే అలవెన్స్ లు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక్ పే పెరిగినప్పుడు ఆ మేర పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. దీని వల్ల చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తరువాత వచ్చే మొత్తంతో పాటు గ్రాట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రధానంగా ప్రైవేటు సెక్టార్ లో పని చేసే వారికి జీతంలో ఎక్కువ శాతం అలవెన్స్ లే ఉంటాయి. కొత్త చట్టం వల్ల వారికి చేతికి వచ్చే జీతం తగ్గుతుంది.

కార్మికులకు ఏడాదిలో ఇచ్చే సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే కొత్తగా ఉద్యోగం చేరిన వారు 180 రోజులు దాటిన తర్వాత సెలవులు పొందవచ్చు. ప్రస్తుతం 240 రోజులు దాటిన తరువాత సెలవులు వస్తున్నాయి. అయితే నూతన కార్మిక చట్టాలను కేంద్రం ఆమోదించినప్పటికీ (కేంద్రం, రాష్ట్ర) ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేసి అమలు చేయాల్సి ఉంటుంది.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

20 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

45 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago