ఒక మనసు సినిమా ద్వారా టాలివుడ్ కు పరిచయం అయిన మెగా హీరోయిన్ నిహారిక. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ అవుతుంది అనుకున్న ఈ చిత్రం అంచనాలను తారుమారు చేస్తూ తుస్ మన్న విషయం మనకు తెలిసిందే. సినిమా విషయం అటుంచితే నిహారికకు ఈ చిత్రం ద్వారా మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. కానీ మెగా ఫ్యామిలీ నుంచి అనుకోకుండా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మాత్రం నిహారిక ఒక్కరే అని చెప్పొచ్చు. అయితే మొదటి సినిమా బాక్సాఫిస్ దగ్గత బోల్తా పడినా కానీ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం కూడా అనుకున్నంతగా ఆడలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. తర్వాత వచ్చిన సూర్యకాంతం కూడా బోర్లా పడింది.
నిహారిక యాక్ట్ చేసి ఇన్ని చిత్రాలు టాలీవుడ్ లో తుస్సుమన్నా.. ఈ అమ్మడు క్రేస్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో తన అభిమానులను ఎప్పటికప్పుడూ ఆనంద పరుస్తోంది ఈ చిన్నది. ఈ మధ్య తను పెళ్లి పీఠలను ఎక్కనుంది అనే వార్త అందరిని షాక్ గురి చేసింది. చైతన్యాతో ఏడు అడుగులు నడుస్తున్నా అంటూ తను పలు పోస్ట్ లు చేస్తూ.. తన ఆనందాన్ని మెగా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇక పెళ్ళి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయదేదమో అని మెగా ఫ్యాన్స్ ఆవేదన చెందారు.
కానీ నిహారిక మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను తీస్తానని తెలపడంతో అభిమానుల ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది. ఈ పెళ్లి వేడుకకు డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహుర్తాన్నిఖరారు చేశారు. ఇది కూడా రాజస్థాన్ లోని ఉదయ్పూర్లోనున్న ఉదయ్ విలాస్ నిహారిక పెళ్లి వేదికగా మారనుంది.ఈ వేడుకతో నిహారిక-చైతన్యలు ఒక్కటికాబోతున్నారు.వీటికి సంబంధించిన ఏర్పాట్లను నిహారిక సోదరుడు హీరో వరుణ్ తేజ్ చూసుకుంటున్నారు.
ఈ పెళ్లి మరో నెల రోజులు మాత్రమే ఉంది. దాంతో నిహారిక తెగ ఫొటో షూట్స్ చేస్తోంది. మాడ్రన్ డ్రెస్లలో నిహారిక అందాలను ఆరబోస్తోంది.దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. నిహారిక సోషల్ మీడియాను షేక్ చేస్తోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.