NIHARIKA: అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరైన మెగా డాటర్ కొణిదెల నిహారిక మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. నిహారిక.. నిహారిక అంటూ సాగే పాటతో ఎంటైన నిహారిక కామెడీ స్టార్ అలీ అడిగిన ప్రశ్నలకు తన దైన రీతిలో సమాధానాలు చెబుతూ ప్రేక్షకులు నాన్ స్టాప్ వినోదాన్ని అందించింది.
Bigg Boss 5 Telugu: ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటరాజ్ మాస్టర్..!!
అన్నయ్య హీరో అవుతాడనుకోలేదు..
ఇక తన అన్నయ్య వరుణ్ తేజ్ హీరో అవుతాడని తాను చిన్నపుడు అనుకోలేదని నిహారిక తెలిపింది. పెళ్లి తరువాత నిహారిక యాక్టింగ్ కెరీయర్ కు దూరమైనా కానీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. తన పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిర్చారని తనది ప్రేమ వివాహం కాదని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను టీచర్ అవ్వాలని అనుకున్నానని, పెద్ద పెరిగిన తర్వాత డాక్టర్ అవ్వాలని భావించానని తాను తెలిపింది. కానీ బైపీసీలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుందని డాక్టర్ కోర్సును చదవలేదని పంచ్ వేసింది. నాన్న నాగబాబు తనను మమ్మీ అని పిలుస్తాడని చెప్పుకొచ్చింది. ఇక వరుణ్ తేజ్ తనను నిహ, బంగారం అని పిలుస్తాడని నిహారిక అలీతో చెప్పింది. వరుణ్ తేజ్ తో జరిగిన చైల్డ్ వుడ్ ఫైట్స్ గురించి చెప్పుకొచ్చింది. తాను హీరో అవుతాడని తెలియక చిన్నపుడు తన మొహం మీద రక్కేదాన్నని చెప్పింది.
Cactus Plant: ఈ మొక్క తో మీ అందం రెట్టింపు..!!
మాక్కొంచెం తిక్కుంది..
మెగా ఫ్యామిలీలో తనకు, సాయికు, మా నాన్నకు, మా చిన్నత్తకు కొంచెం మెంటల్ ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మీ నాన్న నాగబాబులో ఎవరంటే ఇష్టం అని అడగ్గా తనకు తన నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పింది. తండ్రిపై తనకున్న ప్రేమను చూపెట్టింది. పెళ్లికి ముందు తనకు చైతన్యతో ఎటువంటి పరిచయం లేదని బహుశా చైతన్య తనను ఏదైనా టీవీ ప్రోగ్రాంలో చూసాడు కావొచ్చని చెప్పుకొచ్చింది.