Maestro : యూత్ స్టార్ నితిన్ భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన చెక్, రంగ్ దే సినిమాలు నితిన్ కి ఆశించినంత సక్సెస్ లు దక్కలేదు. చెక్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. చంద్ర శేఖర్ ఏలేటి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టింది. ఈ సినిమా జనాలను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రంగ్ దే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని భావించాడు. ట్రైలర్, సాంగ్స్ తో సినిమా మీద బాగా అంచనాలు వెల్లడయ్యాయి.

కానీ సినిమా మాత్రం రొటీన్ స్టోరీ అని రిలీజయ్యాక అందరూ అభిప్రాయపడ్దారు. పేరుకు బావుందని అన్నారే గానీ కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో రంగ్ దే సినిమా మీద నితిన్ పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఇప్పుడు ఈ యూత్ స్టార్ ఆశలు, నమ్మకాలు మాస్ట్రో సినిమా మీదే ఉన్నాయి. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో ముగ్గురు పాత్రలు చాలా హైలెట్‌గా నిలిచాయి. హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానాకి అవార్డ్ కూడా దక్కింది.
Maestro : మాస్ట్రో నితిన్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.
దాంతో నితిన్ ఈ సినిమా రైట్స్ కొన్నాడు. తనే హీరోగా నటించడానికి రెడీ అయ్యాడు. రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ లో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు మాస్ట్రో సినిమాతో నితిన్ కూడా బ్లైండ్ పాత్రలో నటించి హిట్ కొట్టబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. నభా నటేశ్ హీరోయిన్‌గా, తమన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిట్ అని చిత్ర బృందం నమ్మకంగా ఉందట. తాజాగా ఈ సినిమాలో నుంచి వీడియో సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్ సినిమా మీద అంచనాలు బాగానే అంచనాలు పెంచేస్తుంది. చూడాలి మరి మాస్ట్రో నితిన్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.