NewsOrbit
న్యూస్

తెల్లారుతూనే చంద్రబాబుకి షాక్… కీలక ఎమ్మెల్యే జంప్?

ఊహించిన విషయమే అయినా… సడన్ గా వినేటప్పటికీ అదో షాక్ లా ఉంటుంది! ఈ విషయంలో ఇలాంటి షాక్ లో రోజుకొకటి బాబుకు తగులుతూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిననాటినుంచి మొదలు.. అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ వెలుపల అయినా… సొంత పార్టీలో అయిన, అధికారపార్టీ నుంచైనా… ఏదో ఒకదెబ్బ తగులుతూనే ఉంది! ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడిన పరిస్థితి! టీడీపీని వీడారే తప్ప.. వైసీపీలో చేరలేదని వైకాపా నుంచి లాజికల్ వివారణలు. ఆ సంగతులు అలా ఉంటే.. తాజాగా మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు పార్టీని వీడనున్నారంట. ఇది చాలా రోజులుగా నానుతున్న వ్యవహారమే అయినా… బాబు ఇప్పుడున్న పరిస్థితికి ఇది మరింత షాకింగ్ అనే చెప్పాలి.

కరణం బలరాం సైకిల్ దిగిపోయిన అనంతరంం చేసిన కామెంట్లు… త్వరలో మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారు అని! ఆ మాట ఆ పార్టీని ఏ రేంజ్ లో కలవరపెట్టి ఉంటుందో ఊహించుకోవచ్చు! ఈ క్రమంలో… అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే వైసీపీ కీలకనేతలు లతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో… పరిస్థితి చేయిదాటిపోతుందని భావించారో లేక ఆలస్యం అమృతం విషయం అని అనుకున్నారో కానీ… వైసీపీలో చేరేందకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని గొట్టిపాటి అంటున్నారట.

ఇంక ఆ రేంజ్ లో ఫిక్స్ అయ్యాక టీడీపీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎవరు ఆయన్ను ఆపగలరు. అందుకే అధిష్టానం కూడా… తగిలినదెబ్బల్లో ఇదొకటి అని సరిపెట్టుకోనున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా… ప్రకాశం జిల్లాలో వైకాపా కు అద్దెబలం పెరుగుతుందనే చెప్పాలి. ఇది సొంతబలంగా మారాలంటే… జగన్ రూల్స్ ఒప్పుకోవు. ఫలితంగా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. కాబట్టి… వీరంతా సైకిల్ దిగిపోతారు తప్ప ఫ్యాన్ కిందకు ప్రత్యక్షంగా చేరలేరన్నమాట!! ఏది ఏమైనా… బాబు టైం చాలా బ్యాడ్ గా ఉందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju