NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Magunta Srinivasulu Reddy: ఎంపీ మాగుంటను కలిసిన టీడీపీ నేతలు .. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన మాగుంట..!

MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీసీ ఎంపీ టికెట్ మరల మాగుంటకు ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిరాకరించింది. మాగంట టికెట్ కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ అధిష్టానం ససేమిరా అనడంతో ఆయన మిన్నకుండిపోయారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పార్టీ హైకమాండ్ నియమించింది.

Magunta Srinivasulu Reddy

ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగడానికి అంగీకరించారని ఆ పార్టీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి ఇంతకు ముందు పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీగా ఉన్న మాగంటను ఆహ్వానించలేదు. పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టారు. దీంతో మాగుంట మనస్థాపానికి గురైయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

మాగుంట కుటుంబానికి అహాంకారం లేదని, ఆత్మాభిమానం ఉందని గౌరవం లేని చూట ఉండటం అనవసరం భావించి పార్టీ వీడుతున్నట్లుగా పేర్కొన్నారు. కాగా ఇవేళ ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట నివాసంలో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, బీఎస్ విజయ్ కుమార్, ఆశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ చార్జి ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ చార్జి రవికుమార్ భేటీ అయ్యారు. మాగుంటతో టీడీపీ నేతలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Breaking Ycp mp magunta son arrested in delhi liquor scam
Magunta Raghava reddy

అయితే ఈ సందర్భంలో మాగుంట కీలక ప్రకటన చేశారు. త్వరలో తమ కుటుంబం టీడీపీలో చేరుతుందని మాగుంట తెలిపారు. అయితే పార్టీ హైకమాండ్ సూచన మేరకు తాము ఎప్పుడు పార్టీలో చేరేదీ నిర్ణయించుకుంటామని చెప్పారు. రెండు రోజుల్లో తమ కుటుంబం టీడీపీలో చేరుతుందని చెప్పారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనీ, తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే కాక అప్రూవర్ గా మారిన రాఘవరెడ్డికి చంద్రబాబు అభ్యర్ధిత్వం ఖరారు చేస్తారా..? లేక శ్రీనివాసులు రెడ్డినే బరిలో దిగమని కోరతారా? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

YSRCP: అభిమానులకు ముద్రగడ పద్మనాభం కీలక లేఖ ..వైసీపీలో చేరిక ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju