NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: సీఎం పదవి, పొత్తులపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు(గా)..!

Pawan Kalyan: జనసేన కార్యకర్తలు ప్రతి సభలో సీఎం .. సీఎం అని నినాదాలు చేస్తుండటం, ఇటీవల సీనియర్ నేత హరేరామ జోగయ్య ..సీఎం పదవి ఆఫర్ చేస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనీ లేకుంటే ఒంటరిగానే జనసేన పోటీ చేయాలని సూచించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. పదవులు కోరుకోకూడదని, అవి వాటంతట అవే రావాలన్నారు. బలం నిరూపించుకోకుండా సీఎం పదవి ఎలా అడుగుతామని ప్రశ్నించారు. ఎన్నికల్లో 20 – 30 స్థానాలు గెలిచి ఉన్నట్లయితే, కర్ణాటక లో కుమారస్వామి మాదిరిగా సీఎం పదవి వచ్చేదన్నారు. షరతులు పెట్టి ముఖ్యమంత్రి పదవిని సాధించలేమని అన్నారు. బలాన్ని బట్టి సీట్లు అడుగుతామని చెప్పారు. జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.

Pawan Kalyan Press meet

 

తన సత్తా ఏమిటో చూపించి అప్పుడు ముఖ్యమంత్రి పదవి అడుగుతానని, అంతే తప్ప ముందుగా సీఎం పదవి కావాలని చెప్పి పొత్తులు కుదుర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై విముఖతతో ఉన్న పార్టీలను ఖచ్చితంగా ఒప్పిస్తామని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో బీజేపీ కేంద్ర పెద్దలతో ఈ విషయాలపైనే చర్చించానన్నారు. ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వస్తున్నందున జూన్ 3వ తేదీ నుండి ఇక్కడే ఉంటాననీ, ప్రజా సమస్యలపై పోరాడతానని పవన్ తెలిపారు.

రాష్ట్రంలో వైసీపీని ఓడించేందుకు బేషరతుగా పొత్తులు పెట్టుకోవడానికి పవన్ సిద్దంగా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. బీజేపీతో కలుపుకుని టీడీపీతో కలిసి వెళ్లాలన్న ప్రయత్నంలోనే పవన్ ఉన్నట్లు తెలుస్తొంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో 30 శాతం పైగా ఓటింగ్ ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మిగిలిన నియోజకవర్గాల్లో గతం కంటే మెరుగ్గా ఉందని చెప్పారు. పొత్తులు కూలానికి సంబంధించినవి కాదనీ రాష్ట్రానికి సంబంధించినవి అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తల గురించి మాట్లాడానని పేర్కొన్నారు.

తమ బలాన్ని బట్టే సీట్లు అడుగుతామని చెప్పిన పవన్ కళ్యాణ్.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా పొత్తుల వల్లే బలపడ్డాయి అన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ గౌరవానికి భంగం లేకుండా పొత్తుల విషయంలో ముందుకు వెళతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ నుండి అధికారం తీసేసుకోవాలి, ప్రజలకు అధికారం అప్పగించాలి ఇదే మా లక్ష్యమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. వామపక్షాలతో కలిసి వైసీపీపై పోరాటం చేయాలని తనకు ఉంది కానీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉంటాయన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నామని తెలిపారు.

సీ హారియన్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించిన సీఎం జగన్

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju