ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ కొన్ని సంవత్సరాల నుండి తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినీ నటుడు, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సినీ రంగంలో చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్ కు సంతకం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇక సినిమా రంగం లోని అన్ని అంశాలపై రాజకీయ అంశాల పై స్పందించే రేణుదేశాయ్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇప్పటికీ అభిమానిస్తూ ఉంటారు. పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రెండవ పెళ్లి కూడా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో గతంలో సోషల్ మీడియాలో పెద్దఎత్తున గందరగోళం జరిగింది.
అయితే చివరికి ఆమె పర్సనల్ లైఫ్ పైన ఫోకస్ చేయడం అందరూ చేయడం మానేశారు. ప్రస్తుతం రేణు గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్యనే షూటింగ్ లో ఆమె పాల్గొన్నట్లు కూడా తెలిసింది. ఇక బ్రేక్ తీసుకుందో తెలియదు కానీ గోవాలో హాయిగా సముద్రంలో జలకాలాడుతూ ఒక పిక్ పెట్టింది. సముద్రంలో నిండా మునిగి ఉన్న రేణు దేశాయ్ కేవలం తల మాత్రమే పైకి పెట్టి తన పరిస్థితికి తగ్గట్టు ఒక మంచి కొటేషన్ కూడా పెట్టింది.
అటు చూస్తేనేమో మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి సందడి జోరందుకుంది. స్టార్ లందరూ అక్కడ వాలిపోయారు. కొడుకు అకీరా నందన్ తో పాటు ఆమె కూతురు కూడా పెళ్లి కి వెళ్ళింది కానీ అక్కడ రేణుదేశాయ్ కనపడలేదు. రేణు ఇక్కడ గోవాలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తనకు సినిమాలకు దర్శకత్వం వహించడం ఇంట్రెస్ట్ అన్న రేణు ఆ దిశగా ఎప్పుడు అడుగులు వేస్తుందో చూడాలి.
https://www.instagram.com/p/CIr25sxhif3/?igshid=11x7u7lqjg20o