ఆమోదం తెలిపిన పెంటగాన్
వాషింగ్టన్: అమెరికా – మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడ నిర్మించాలనుకున్న ట్రంప్ కు మంచి ఊరట లభించింది. ఆయనకు గోడ కోసం 100 కోట్ల డాలర్లు కేటాయిస్తూ పెంటగాన్ తాత్కాలిక చీఫ్ పాట్రిక్ షానహాన్ ఆమోదం తెలిపారు. 92 కిలోమీటర్ల మేర 18 అడుగుల ఎత్తున కంచె వేయడం, రోడ్లు వేసి మెరుగుపరచడం తదితర కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. 100 కోట్ల డాలర్లను డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ అండ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ కు కేటాయించేందుకు అమెరికా ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్లకు షానహాన్ అధికారం ఇచ్చారు. ఈ విషయాన్ని పెంటగాన్ ఓప్రకటనలో తెలిపింది.
డ్రగ్ స్మగ్లర్లు అంతర్జాతీయ సరిహద్దుల గుండా రాకుండా ఆపేందుకు రక్షణ శాఖకు తగిన అధికారం ఉందని తాత్కాలిక రక్షణ మంత్రి చెప్పారు. అందుకు రోడ్లు వేయడం, కంచెలు కట్టడం, మెరుపులు వచ్చేలా చేయడం తప్పదన్నారు. పెంటగాన్ ముసాయిదా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు ఈప్రకటన రావడం గమనార్హం. కాంగ్రెస్ ఎంత సేపటికీ తనకు గోడ కట్టేందుకు బడ్జెట్ ఇవ్వకపోవడంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. దాన్ని గత నెలలో జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులను పక్కన పెట్టి 800 కోట్ల డాలర్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.