NewsOrbit
న్యూస్

వెనక్కి తగ్గిన ఆర్.ఆర్.ఆర్.: రాజీ ప్రయత్నమా రాజా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు క్షణాల్లో మారిపోతున్నాయి. వైసీపీ పునాదులు కదిలించేద్దామని అనుకొని.. అదే తడవుగా టీడీపీ అనుకూల మీడియాలో సొంత పార్టీపై అవాకులు చవాకులు పేలుస్తోన్న నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఒక్కసారిగా తన అభిమానులకు షాకిచ్చాడు. సెంట్రల్ మినిస్టర్స్ ఛాంబర్స్ లోకి నేరుగా వెళ్లగలిగే స్థాయి తనదని చెప్పిన ఆయన… మాటమీద నిలబడకుండా హైకోర్టును ఆశ్రయించాడు. తనపై ఎమ్మెల్యేలు పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ కోర్టుకెక్కాడు.

అవును… నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలో తనపై నమోదవుతున్న కేసులను కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ లో వెల్లడించారు. రఘురామకృష్ణంరాజు తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని తాజాగా మంత్రి శ్రీరంగనాథరాజు, వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగుకుండా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అయిన.. కారుమూరి వెంకట నాగేశ్వరావు, ముదునూరి ప్రసాద్ రాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రఘురామ కృష్ణంరాజుకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందా అనే అనుమానం కలిగేలా… ఆ సేకులు కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించడంపై ఆయన అభిమానులు కూడా షాక్ కి గురౌతున్నారు. ఎవరి మాటలను భరోసాగా భావించి ఇంతకాలం విరుచుకుపడ్డారో… వారి నుంచి ఆశించిన స్పందన కరువైన వేల.. ఇలా దొడ్డిదారిన కోర్టులను అశ్రయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా తనపై ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా వైసీపీ క్యాడర్ మాత్రం.. “ఇప్పుడు ఏమైంది… మీ కొంటె చూపు.. కోరచూపు.. కారుచూపు.. వీరచూపు..” అంటూ సెటైర్స్ పేల్చేస్తున్నారు. ఆర్.అర్.ఆర్. ఈ కేసులకే ఇలా పారిపోతాడని అనుకోలేదంటూ వైసీపీ సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. మరి ఈ విషయంలో కోర్టు ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి!

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N