Rajini Kanth : సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ Rajini Kanth గత ఏడాది రాజకీయాల్లోకి రావాలని అనేక ప్రయత్నాలు చేయడం మనకందరికీ తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కొత్త పార్టీతో పోటీ చేయాలని, అందుకు సంబంధించి రజినీకాంత్ చాలామంది రాజకీయ నేతలతో భేటీ అవుతూ అనేక నిర్ణయాలు తీసుకుని సరిగ్గా పార్టీ ప్రకటన చేసే సమయంలో అనారోగ్యానికి గురికావడంతో…తాను పొలిటికల్ రంగంలోకి రావడం భగవంతునికి ఇష్టం లేదు అంటూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ విషయంలో రజిని వెనక్కి తగ్గటం జరిగింది.
దీంతో రజిని వస్తారని ఎంతగానో ఆశ పడ్డ అభిమానులు ఫుల్ నిరాశలో ఉన్నారు. అయినా కానీ రజనీకాంత్ ఆరోగ్యమే ముఖ్యం అని భావించడంతో తర్వాత కొద్ది కొద్దిగా తేరుకుంటూ ఉన్నారు. అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న రజినీకాంత్ సినిమా షూటింగ్ ల విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అన్నాత్తే సినిమా చేస్తున్నా సమయములో రజినీకాంత్ అస్వస్థతకు గురవడంతో… మొన్నటి వరకు విశ్రాంతి లో ఉన్న రజిని తాజాగా సినిమా షూటింగ్ కి రెడీ అయినట్లు ఆ సినిమా డైరెక్టర్ శివ స్పష్టం చేశారు. చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా మిగతా బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలని రజనీకాంత్ రెడీ అయినట్లు.. ఎలాంటి విరామం లేకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని సూచించినట్లు దానికి తగ్గ షెడ్యూల్ ప్రిపేర్ చేయాలని పేర్కొన్నారట.