Rashikhanna : కొంతమంది హీరోయిన్స్ వరుసగా క్రేజీ మూవీస్ చేసే అవకాశాలు అందుకుంటారుగానీ స్టార్ డం మాత్రం దక్కించుకోలేరు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ కూడా రాశిఖన్నా కూడా ఒకరు. ఈమె తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్రాస్ కేఫ్ సినిమాతో హీరోయిన్ గా మారిన రాశిని చూసి తెలుగు మేకర్స్ అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాతో అమ్మడు బాగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు తాను మల్టీ ట్యాలెంటెడ్ అని డెబ్యూ సినిమాతో ప్రూవ్ చేసింది.
కెరీర్ ప్రారంభం నుంచి రాశికి పెద్దగా బ్రేక్ రాకుండానే సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇక రాశితో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, గోపీచంద్, రాం, సాయి ధరం తేజ్..ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు సక్సెస్ అయినప్పటికీ స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. ఈమె గత చిత్రం సాయి ధరం తేజ్ – మారుతి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి రోజు పండుగే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో రూపొందుస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని నాగ చైతన్య – విక్రం కె కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తోంది.
Rashikhanna : రాశిఖన్నా తాజాగా నటించిన కోలీవుడ్ మూవీ ఆరణ్మయి 3.
అయితే ప్రస్తుతం రాశిఖన్నాకి తెలుగు కంటే తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. దాదాపు 6 తమిళ సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ స్టార్ డం తెచ్చుకునేందుకు గ్లామర్ ట్రీట్ కూడా బాగానే ఇస్తోందట. తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే బాగా క్రేజ్ ఉంటుంది. వాళ్లని అలాగే తన కోలీవుడ్ కెరీర్ని దృష్ఠిలో పెట్టుకొని అక్కడ గ్లామర్ అండ్ రొమాంటిక్ రోల్స్ కి సై అంటోంది. ఈ క్రమంలో రాశిఖన్నా తాజాగా నటించిన కోలీవుడ్ మూవీ ఆరణ్మయి 3. ఇందులో త్రిష – హన్సికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. ఆర్యకి జంటగా నటించిన రాశికి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.