Raviteja: ఇక మాస్ మహారాజా రవితేజ కెరీర్ హీరోగా టాలీవుడ్లో క్లోజ్ అని అందరూ అనుకుంటున్న సమయంలో క్రాక్ సినిమాతో భారీ హిట్ కొట్టి ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ ఒక్క సినిమా ఇచ్చిన కిక్‌తో వరుసగా అరడజను సినిమాలను లైన్లో పెట్టారు. చెప్పాలంటే రవితేజ కెరీర్లో ఎప్పుడూ కూడా ఈ రేంజ్లో సినిమాతో సినిమా షూటింగ్ చేసింది లేదనే చెప్పాలి. ప్రస్తుతం మాస్ మహారాజ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
ఇక రావణాసుర, ధమాకా సినిమాలు రెండు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ హీరోగా నటిస్తున్న స్టూవర్టు పురం గజదొంగ బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు సెట్స్ మీదకు వచ్చింది. ఇప్పటికే నైట్ షెడ్యూల్ షూటింగ్‌ను చిత్రబృందం కంప్లీట్ చేసింది. ఇది రవితేజ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే, మిగతా చిత్రాలకంటే టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మాస్ మహారాజ ఎక్కువగా శ్రమిస్తున్నాడట. మేకోవర్ పరంగా షూటింగ్ సమయం పరంగా బాగా శ్రమిస్తున్నాడట. మామూలుగానే మాస్ మహారాజ జెట్ స్పీడ్‌లో పనిచేస్తుంటారు.
Raviteja: టైగర్ నాగేశ్వర రావు కోసం భారీ సెట్స్
ఇప్పుడు మరింత స్పీడ్‌లో సినిమాలను పూర్తి చేస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు మూడేళ్ళకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. అందుకే, ఆ గ్యాప్‌ను వీలైనంత త్వరగా ఫిల్ చేయాలని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిటవడం..ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసమే రవితేజ ఇలా డే అండ్ నైట్ బయోపిక్ సినిమా కోసం శ్రమిస్తున్నాడు. ఇక టైగర్ నాగేశ్వర రావు కోసం భారీ సెట్స్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సెట్స్ సినిమాకు హైలెట్‌గా నిలవడమే కాదు..గ్యారెంటిగా రవితేజకు పాన్ ఇండియన్ స్టార్‌గా కూడా క్రేజ్ తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు.