రియల్‌మి కంపెనీ బడ్జెట్ ధరలకే రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. రియల్ మి సి12, సి15 ఫోన్స్‌ను విడుదల చేశారు. రియల్ మి సి12లో 6.5 ఇంచెస్ డిస్ ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉంది. 256 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లు వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మరో 2 కెమెరాలను ఇచ్చారు. ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార కూడా ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది.
రియల్ మి సి15లో 6.52 ఇంచెస్ డిస్ ప్లే ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 3,4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. 32, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 3 కెమెరాలు ఇచ్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులోనూ ఉంది.
* రియల్ మి సి12 ఫోన్ ధర రూ.8,999. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.
* రియల్ మి సి15 ఫోన్ 3జీబీ మోడల్ ధర రూ.9,999. 4జీబీ మోడల్ ధర రూ.10,999. ఈ నెల 27 నుంచి లభిస్తుంది.