Renu Desai: సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగినవారిలో ముందు వరుసలో ఉంటది రేణుదేశాయ్. తన వ్యక్తిగత విషయాలు అదే విధంగా సమాజంలో జరిగే అనేక విషయాలు గురించి స్పందిస్తూ … నెటిజన్లతో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటది. ముఖ్యంగా పిల్లల గురించి కూడా అనేక విషయాలు చెబుతూ ఉంటది రేణు. ఇదే క్రమంలో తన దృష్టికి ఏదైనా అవసరం తీర్చేవిధంగా పరిస్థితి వస్తే వెంటనే స్పందిస్తూ ఉంటది. అయితే ప్రస్తుతం దేశంలో అనేక మంది కరోనా బారినపడి .. ఆక్సిజన్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో.. తన వంతుగా తన దృష్టికి మెసేజ్ రూపంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమస్యలు తీర్చే విధంగా రేణుదేశాయ్ రాణిస్తూ ఉంది.
తన పరపతిని ఉపయోగించి .. ఎవరికైతే ఆక్సిజన్ అదేవిధంగా కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి తన వంతు సహాయాన్ని అందిస్తూ ఉంది రేణుదేశాయ్. పరిస్థితి ఇలా ఉండగా సోషల్ మీడియాలో హాయ్.. హలో అంటూ ఈ మెసేజ్ లు పెడుతూ ఉండటంతో .. ఎవరైతే సహాయం అందాలని రేణుదేశాయ్ కి మెసేజ్ లు పంపుతున్నారు వారి మెసేజ్ లు కిందికి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఈ పరిస్థితిని లేవనెత్తి తాజాగా నెటిజన్లకు .. ముఖ్యంగా హాయ్ హలో అంటూ పనికి రాని మెసేజ్ లు పెడుతున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది రేణుదేశాయ్.
దయచేసి నాకు అనవసరమైన మెసేజ్ లు పంపించవద్దు వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు . అంతేకాకుండా అటువంటి మెసేజ్ వల్ల .. సరైన సమయంలో హెల్ప్ అందక కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం నేను ఎవరికీ ఆర్థిక సహాయం చేయటం లేదు కేవలం కరోనా బారిన పడిన వారికి.. చేతనైనంత హెల్ప్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చే తరహాలో విజ్ఞప్తి చేసింది రేణుదేశాయ్.