ట్రెండింగ్ న్యూస్ సినిమా

Shanmukh Jaswanth : షన్ముఖ్ జస్వంత్ సూర్య వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ చూశారా?

Shanmukh Jaswanth షన్ముఖ్ జస్వంత్ సూర్య వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ చూశారా
Share

Shanmukh Jaswanth : షన్ముఖ్ జస్వంత్ Shanmukh Jaswanth తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్. ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. ఆయన యూట్యూబ్ లో ఏదైనా వీడియో వదిలితే చాలు.. కోట్లలో వ్యూస్ వస్తాయి. అది మనోడికి ఉన్న ఫాలోయింగ్. జస్వంత్ కి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే.. షన్ముఖ్ కోసం చాలామంది వెంటపడుతున్నారు. ఆయనతో వెబ్ సిరీస్ చేయాలని.. ఆయనతో ఏదైనా షో ప్లాన్ చేయాలని.. చాలామంది ఆశపడుతున్నారు కానీ.. షన్ముఖే దొరకడం లేదు. బిగ్ బాస్ 5 లోనూ షన్ముఖ్ కు ఆఫర్ వచ్చిందని ఇటీవల వార్త ఒకటి ప్రచారంలో ఉంది. బిగ్ బాస్ 5 సీజన్ మొదటి కంటెస్టెంట్ షన్ముఖేనంటూ వార్తలు వచ్చాయి. దాంట్లో నిజమెంతో? అబద్ధమెంతో తెలియదు కానీ.. షన్ముఖ్ కు మాత్రం బాగానే పాపులారిటీ పెరుగుతోంది.

Shanmukh Jaswanth surya web series episode two released
Shanmukh Jaswanth surya web series episode two released

Shanmukh Jaswanth : సూర్య వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ అద్భుతం

ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటించిన జస్వంత్.. ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీ ఖాళీగా తిరుగుతూ ఫ్రెండ్స్ తో సరదాగా తాగుతూ.. తల్లిదండ్రులతో తిట్లు తినే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ లో జస్వంత్ జీవించేశాడు.

షన్ముఖ్ జస్వంత్ నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో.. అంతకన్నా ఎక్కువ సక్సెస్ అయింది. సూర్య వెబ్ సిరీస్. ఇప్పటికే విడుదలైన మొదటి వెబ్ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. తాజాగా రెండో ఎపిసోడ్ ను విడుదల చేశారు. ఇది విడుదలైన రెండు రోజుల్లోనే 5 మిలియన్ల వ్యూస్ ను సాధించుకుంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సూర్య వెబ్ సిరీస్ రెండో ఎపిసోడ్ ను చూసేయండి.

 


Share

Related posts

అఖిల ప్రియ ఆలోచన కన్నా వరకూ చేరిందా?

CMR

బాలయ్యకి “ఆమె” ని ఫిక్స్ చేసిన బోయపాటి ..?

GRK

కాజల్ అగర్వాల్ కి అవి రెండు కళ్ళట.. ఒకదానికోసం ఇంకోటి వదులుకోనంటోంది ..?

GRK