Singer Sunitha: సునీత కంటే సింగర్ సునీతగానే ఆమె అందరికీ తెలుసు. బేసిగ్గా సింగర్ అయిన సునీత మన తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను తనదైన ముద్రని వేశారు. దాదాపు ఓ దశాబ్దం పాటు ఆమె హవా కొనసాగిందనే చెప్పాలి. రమణ గోగుల సంగీతంలో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఆమె పాడిన ‘అసలేం గుర్తుకు రాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా’ అనేపాట తన కెరీర్ లోనే హైలెట్ అని చెప్పుకోవాలి. దానితోనే ఆమె దశ, దిశ మారిపోయాయి.
Singer Sunitha: సునీత మీద తాజాగా వస్తున్న వార్తలు ఇవే..
ఇకపోతే గత కొన్ని రోజులుగా సునీతపైన రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. ఆమె గర్భవతి అని కొందరు రాస్తున్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని చూస్తోందని ఇంకొందరు రాస్తున్నారు. అయితే ఆమె ఇంతవరకు ఎక్కడా ఆ విధమైన సో కాల్డ్ వ్యాఖ్యలు చేయలేదు. రెండవ భర్త అయినటువంటి రామ్ తో కలిసి ఆమె సంతోషంగా వున్నారు. అతని వ్యాపారాలలో ఈమె కూడా చేదోడు వాదోడుగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.
ఆమె లేటెస్ట్ వీడియో స్టఫ్ ఇదే..
సునీత సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటారని చెప్పుకోవాలి. అప్పుడపుడు తన యాక్టివిటీస్ ని ఇన్ స్టా వేదికగా పబ్లిష్ చేయడం తనకొక హాబీ. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ అరటి గెలను నరికిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అంతే… క్షణాల్లో అది కాస్త వైరల్ అయ్యింది. బేసిగ్గా సునీత ప్రకృతి ప్రేమికురాలు. తాను చేస్తే ప్రతి పోస్టులో ప్రకృతిని ప్రతిబింబించేలా మాట్లాడుతుంది.