Mahesh Babu ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు సుకుమార్. డిఫరెంట్ సబ్జెక్ట్ తో పాటు హీరోయిజం ఈ ఛానల్ డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తూ ఉంటారు. అటువంటి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో “ఉపేనా” అనే సినిమా చేయడం జరిగింది. మెగా హీరో వైష్ణవ తేజ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ బుచ్చిబాబు తీసిన ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.
Mahesh Babu ప్రమోషన్ కార్యక్రమం
ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ క్రమంలో “ఉపేనా” సినిమా విషయాలు తెలియజేస్తు.. మరో పక్క తన లైఫ్ లో విషయాలు కూడా పంచుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు ఫ్యామిలీ గురించి బుచ్చిబాబు కీలక కామెంట్ చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా పని చేసినట్లు ఆ సినిమా సమయంలో.. మహేష్ బాబే కాకుండా ఆయన ఫ్యామిలీ కూడా బాగా దగ్గరైనట్లు తెలిపారు. మనుషులకు ఎవరైనా సరే.. మహేష్ బాబు ఫ్యామిలీ బాగా రెస్పెక్ట్ ఇస్తారని, పలకరింపు కూడా చాలా బాగుంటుందని బుచ్చిబాబు తెలిపారు.
అంత మాత్రమే కాక మహేష్ కొడుకు గౌతమ్.. 1 నేనొక్కడినే సినిమాలో నటించిన సందర్భంలో సినిమా స్టార్ట్ అవ్వక ముందే.. గౌతమ్ తో కనెక్ట్ అవ్వాలని సుకుమార్ సార్..ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పడంతో.. అప్పట్లో మహేష్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే మహేష్ ఫ్యామిలీ బయట వాళ్ళ పట్ల ఎంతో గౌరవంగా మర్యాద ఇస్తారో స్వయంగా చూడటం జరిగిందని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు.