తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు చిత్రంగా , ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. తాజాగా అన్న ది ఓ దారి ….. తమ్ముడిది మరోదారి అన్నట్లుగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తుండగా… ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్లు పంటికింద రాయిలా మారుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలు కామెడీని మించుతున్నాయంటున్నారు.
కోమటిరెడ్డి కలకలం
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొంత కాలం నుంచి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సంచలన కామెంట్లు చేశారు. గతంలో అవకాశం దొరికినప్పుడల్లా.. ప్రధాని మోడీపై, ఎన్డీఏ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చిన ఆయన తాజాగా బీజేపీపై చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపుతున్నాయి.
జీవన్ రెడ్డి సంచలనం…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ సింబల్ పై రాజగోపాల్ రెడ్డి గెలిచాడని గుర్తుచేసిన జీవన్ రెడ్డి సొంత బలంతో గెలిచడాని అనుకుంటే.. రాజీనామా చేసి.. మళ్లీ పోటీచేసి గెలవాలని కోమటిరెడ్డికి సూచించారు.. కాంగ్రెస్ పార్టీని ఇలా బ్లాక్ మెయిల్ చేయడం సరైంది కాదని జీవన్ రెడ్డి హితబోధన చేశారు . తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కామెడీ లేదా ట్రాజెడీ ని మించుతున్నాయంటున్నారు. తెలంగాణ లో జరిగే రాజకీయాలకు సీఎం కేసీఆర్ తో ముడిపెట్టే నేతలు ఈ ఘటనపై , కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై మాత్రం ఎవరిని నిందించాలో ఆలోచించుకోవాలని అంటున్నారు.