ఒక్కసారిగా ప్లేటు మార్చేసిన టీ-కాంగ్రెస్ నేత, షాక్ లో బీజేపీ..??

Share

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే భవిష్యత్తు లేని పార్టీగా రోజు రోజుకి దిగజారిపోతున్నట్లు ఇటీవల ఎన్నికల ఫలితాలు బట్టి చాలా మంది అంచనా వేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఢిల్లీ పెద్దలు అప్రమత్తమై పీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టబెట్టాలి అన్నదానిపై పార్టీలో సీనియర్ నాయకులతో పాటు కీలక నాయకుల దగ్గర అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఠాగూర్ ద్వారా నివేదిక రూపంలో తీసుకోవడం జరిగింది.

ఇటువంటి తరుణంలో పీసీసీ చీఫ్ పదవి విషయంలో పార్టీలో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు గట్టిగా వినబడ్డాయి. అయితే వీరిలో ఎక్కువ శాతం రేవంత్ రెడ్డి కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ నుండి గల్లీ దాకా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 30 తారీకు సమయంలో బీజేపీ పార్టీని ఒక్కసారిగా పొగడటం మాత్రమే కాక బీజేపీలో చేరబోతున్నట్లు తిరుమల పర్యటనలో ప్రకటించడంతో టీ కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.

 

పీసీసీ చీఫ్ పదవి విషయంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కోపం వచ్చినట్లు భావించారు. అయితే ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవి విషయంలో హై కమాండ్ కొద్దిగా తగ్గటంతో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయం సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు చెబుతానని తాజాగా తన నిర్ణయాన్ని వాయిదా వేయడంతో తెలంగాణ బీజేపీకి ఒక్క సారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. మొత్తంమీద చూసుకుంటే కాంగ్రెస్ హైకమాండ్ ని తనను బ్లాక్ మెయిల్ రాజకీయాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

10 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

43 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

44 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago