అమెరికాలో తెలుగు యువకుడి పై కాల్పులు

మిషిగన్, జనవరి6: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో  ఆదివారం మహబుబాబాద్‌కు చెందిన  యువకుడు సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు.  రెస్టారెంట్‌ నుంచి పార్శిల్ తీసుకొని వస్తుండగా దుండగులు కాల్పులు జరిపి, సాయికృష్ణ వద్ద ఉన్న డబ్బు, గుర్తింపు కార్డులను తీసుకుని పారిపోయారు. కాల్పుల్లో సాయికృష్ణ త్రీవ్రంగా గాయపడ్డాడు. సాయికృష్ణ వైద్య చికిత్స ఖర్చుల కోసం తెలుగు సంఘాలు విరాళాలు సేకరిస్తున్నాయి