Throat Pain: సాధారణంగా సీజన్ మారినప్పుడు అన్నా దగ్గు, జలుబు, గొంతు నొప్పి బాధిస్తుంటాయి అయితే ప్రస్తుతం కరోనా లక్షణాల్లో కూడా ఇవి చేరిపోయాయి అయితే ఇప్పటి వరకు గొంతు నొప్పిని తగ్గించడానికి అనేక కషాయాలను, మందులను ఉపయోగిస్తున్నారు. అయితే కషాయాలు, మందులు వలన గొంతు వికారంగా మారిపోతుంది. దాని బదులు ఎంచక్కా గొంతు నొప్పి తగ్గించుకోవడానికి పండ్లను తింటే చాలు.. గొంతు నొప్పి తక్షణమే తగ్గి ఉపశమనం లభిస్తుంది.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Read More: Sonali Bendre: కంటతడి పెట్టిస్తున్న సోనాలి బింద్రే పోస్ట్..!!
* అంజీర లను తింటే గొంతు నొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఐదు అంజీరలను వేసి ఆ నీటిని వేడి చేయాలి. వడపోసిన ఆ నీటిని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
*పైనాపిల్ తినడం వల్ల గొంతు నొప్పి తగ్గి వెంటనే రిలీఫ్ వస్తుంది..
*గొంతు నొప్పి తగ్గించడానికి ఐదు నిమ్మకాయలను ప్రతిరోజు డైట్లో తీసుకోవాలి..
*మల్బరీ లో యాంటీపైరటిక్ గుణాలు ఉన్నాయి. దీని ఎక్కువ సేపు నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
* వీటితో పాటు ప్రతి రోజూ ఓ గ్లాసు వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి తగ్గుతుంది.
* గొంతు నొప్పి సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా వేడి నీటిని తీసుకోవాలి. టీ, కాఫీ, లెమన్ టీ, సూప్ వంటివి తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.