BJP Telangana: తెరవెనుక స్కెచ్ లతో తెలంగాణ బీజేపీ..! కేసీఆర్ కి చెక్ పెట్టె వ్యూహం రెడీ..!?

BJP Telangana: Serious plan behind the Politics
Share

BJP Telangana: తెలంగాణాలో అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ లక్ష్యం.. ఏపీలో ఏ మాత్రం ఉనికి లేని ఆ కాషాయ పార్టీకి తెలంగాణాలో మాత్రం ఆశలు ఉన్నాయి.. 2018 ఎన్నికల్లో పెద్దగా ఊపు లేనప్పటికీ.., 2020 లో దుబ్బాక ఉప ఎన్నిక, అదే ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి ఎక్కడా లేని ఊపొచ్చింది. డైరెక్టుగా సీఎం సీటుపైనే కన్ను పడింది. గత ఏడాది వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని ప్లాన్ వేసుకున్న బీజేపీ.. ఇక సీఎం సీటు ఎక్కేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగిన ప్రణాళికలు అంతర్గత రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ ని చంపేసి.. ఆ స్థానంలోకి తాము రావాలి అనేది మొదటి ప్లాన్. ఆ తర్వాత కేసీఆర్ బలాన్ని తగ్గించడమే లక్ష్యం.. దీని కోసమే తాజాగా చర్చలు, సంప్రదింపులు కొన్ని హాట్ గా సాగిపోతున్నాయి..

BJP Telangana: Serious plan behind the Politics
BJP Telangana: Serious plan behind the Politics

BJP Telangana: ఈటలతో ఎవరెవరు..!?

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖరారయింది. కొత్త పార్టీ అనీ.., కాంగ్రెస్ లో చేరిక అనీ నానా యాగీ చేసిన ఈటల చివరికి బీజేపీలోకి దూకేస్తున్నారు. ఆయనతో పాటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోడానికి రెడీ అవుతున్నరు. ఈ ఇద్దరితో చేరికలు ఆగవు. కొండా సురేఖ దంపతులు, కోమటీరెడ్డీ సోదరులు కూడా బీజేపీలోకి అడుగులు వేసేలా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరూ వచ్చేస్తే తెలంగాణలోని సగం జిల్లాల్లో బీజేపీకి ఎదురు ఉండదని భావిస్తున్నారు. బీజేపీ నేత డీకే అరుణ ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్లిన ఆమె.., కాంగ్రెస్ లో తనతో చనువు ఉన్నా.. బలమైన నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొండా సురేఖ దంపతులు, కోమటిరెడ్డి సోదరులు బీజేపీలోకి వస్తే బీజేపీ ఒక పెద్ద శక్తిగా మారుతుంది. టీఆరెస్ కి సరైన ప్రత్యామ్నాయంగా ఈ నాయకత్వం చురుగ్గా పని చేస్తుంది. అప్పుడు ఈ అందరి కీలక టార్గెట్ ఒక్కరే…

BJP Telangana: Serious plan behind the Politics
BJP Telangana: Serious plan behind the Politics

రేవంత్ రెడ్డి కూడా వచ్చేస్తే..!?

ఇక తెలంగాణాలో టీఆరెస్ కి, కేసీఆర్ కి బద్ధ వ్యతిరేకి అంటే రేవంత్ రెడ్డి. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీకి పెద్ద దిక్కు ఆయనే. టీఆరెస్ కి వ్యతిరేకంగా స్వరం విప్పుతున్నధీ, జనంలోకి వెళ్తున్నది ఆయనే. అందుకే ఈ ఒక్క నాయకుడు కూడా బీజేపీతో కలిస్తే బాగుంటుంది.. తెలంగాణ లో అధికారం సులువవుతుంది అనేది బీజేపీ నేతల యోచన. అయితే రేవంత్ ని రాష్ట్ర నేతలు కాకుండా ఢిల్లీ స్థాయి నుండి డీల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ కాంగ్రెస్ ని వీడాల్సిన పని లేదు. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ ఎదగదు.. ఈ నాయకత్వం మారదు.. కేంద్రంలో కూడా అధికారంలోకి రాదూ అని రేవంత్ అనుకుంటే మాత్రం ఆయనకు బీజేపీ తప్ప మరో ఆప్షన్ లేదు. 2023 ఎన్నికల లోగా ఇదే జరగాలనేది బీజేపీ లో కొందరి లక్ష్యం. మరోవైపు రేవంత్ వస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని కొందరు అడ్డుకునే ప్రయ్నతాలు కూడా చేసే వీలుంది..


Share

Related posts

సీఎం జగన్ మాట తప్పరా?

Mahesh

నాలుగు పార్టీల నూతన్ నాయుడు..!! డబ్బు + రాజకీయం తెచ్చిన పైత్యం..!!

Srinivas Manem

Anna Rambabu: వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కి జనసేన సవాల్..!!

sekhar