NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎమోషనల్ అయిన టిక్ టాక్.. వైరల్ ట్విట్!

భారత దేశంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో మంది చేత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్.. ఈ యాప్ ద్వారా ఎంతో మంది తమలో దాగున్న ఎన్నో వేరియేషన్స్ ను బయటపెట్టడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో చైనా యాప్ లను చాలా మటుకు తొలగించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టిక్ టాక్ యాప్ గురించి.

ఎంతో మంది ఆదరన పొందిన ఈ టిక్ టాక్ యాప్ ను మనదేశం ఇక్కడి పాలసీలకు అనుగుణంగా లేదని దానికి తొలగించినట్టు తెలిపింది. కాగా ఈ యాప్ రిమూవ్ తర్వాత చైనా భారీ నష్టాన్ని చవిచూసిందనే చెప్పుకోవచ్చు. కాగా ఈ యాప్ ను డేటా సెక్యురిటీ తో మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది చైనా. కాగా దీని గురించి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు.

కాగా ఈ ఈ దీపావళీ సందర్భంగా టిక్ టాక్ తమ ఫాలోవర్సును పలకరించి ఒక ఎమోషన్ ట్వీట్ చేసేసింది. ‘ మేం భారత్ ను చాలా మిస్సవుతున్నామని అలాగే ఇండియాను గుర్తు చేసుకున్న ప్రతి రోజూ ఒక దీపం వెలిగిస్తున్నామని’ ట్వీట్ చేశారు. అయితే జాతీయ భద్రతల ధృష్ట్యా భారత్ 59 చైనా యాప్ లను కేంద్ర ప్రభుత్వం జూన్ 29 న నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదించిన యాప్ లలో టిక్ టాక్ కూడా ఒకటి.

అయితే యాప్ ను నిషేధించకముందు మన దేశంలో టిక్ టాక్ ను 61.1 కోట్ల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. అలాగే ఈ టిక్ టాక్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా అయిన డౌన్ లోడ్లలో అది 30.3 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే టిక్ టాక్ యాప్ 2019 లో నే ఎక్కువగా డౌన్ లోడ్ అయినట్టు సర్వేలు చెబుతున్నాయి. కాగా ఈ యాప్ తిరిగి ఇండియాకు చేరుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N