Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటు సౌత్ అలాగే నార్త్ లో కోట్ల మంది ఫాన్స్ ఉన్నారు. ప్రేత్యేకంగా ఆయన స్టైల్ కి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా ‘స్వాతిముత్యం’. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ జన్మస్థలం చెన్నై. 1983 వ సంవత్సరం ఏప్రియల్ 8న అల్లు అర్జున్ జన్మించాడు. అయితే అల్లు అర్జున్ పుట్టి పెరిగింది అంతా తమిళనాడు లోనే. తన స్కూలింగ్ ను సెయింట్ మేరీస్ స్కూల్లో పూర్తి చెయ్యగా ఆ తరువాత హైదరాబాద్ లో మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో చదివాడు. బిబిఎ పూర్తి చేసిన బన్నీ, ఆ తరువాత వెంటనే సినిమాలలోకి వచ్చాడు. అలా కొన్ని సంవత్సరాలు హీరో గా సినిమా ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నాక అల్లు అర్జున్ కి తన ప్రేయసి స్నేహ రెడ్డి తో 2011 మార్చి 6న హైదరాబాద్ లో ఘనంగా వివాహం జరిగింది.
ఇక అల్లు అర్జున్ ఆస్తి విషయానికి వస్తే… అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అవ్వడంతో మొదటి నుంచి అల్లు వారిది కలవారి కలవారి కుటుంబమే. అల్లు అర్జున్ కి రూ. 50లక్షల నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకూ ఖరీదు చేసే 8 కార్లు ఉన్నాయి. అలాగే 2019లో ఆయన కొన్న కార్వాన్ ను ప్రత్యేకంగా 7 న్నర్ర కోట్లు పెట్టి సొంతగా డిజైన్ చేయించుకున్నాడు. అల్లు అర్జున్ కి ఫిలిం నగర్ లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ఖరీదు 10నుంచి 15కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ త్వరలో అల్లు స్టూడియోస్ ను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.