సినీ ఇండస్ట్రీ లో సింగర్ సునీత పేరు తెలియనివారు ఉండరు. ఆమె గొంతుకు కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. సింగర్ గా టాలీవుడ్ లో తనప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఎంతో మంది హీరోయిన్స్ కి తన గొంతుని దానం చేశారు. ఇటీవలే ఆమె రెండవ వివాహాన్ని చేసుకున్న విషయం విదితమే. కేవలం కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సన్నిహితుల మధ్య సునీత రెండవ వివాహం ఘనంగా జరిగింది.
ఇండస్ట్రీ లో సునీత కి ఎంత పాపులారిటీ ఉందో ఆమె రెండో భర్త రామ కృష్ణ వీరపనేని కి కూడా సమాజంలో అంతకన్న ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రామ్ వీరపనేని అన్న పేరు ఇండస్ట్రీ లోఅందరికి సుపరిచితమే.. ఈయన డిజిటల్ మీడియాలో ఒక మొఘల్ లాంటి వారని చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఈ డిజిటల్ మీడియా లోనే అభివృద్ధి చెందుతూవచ్చారు.
ఈ నేపథ్యంలో మ్యాంగో సంస్థ అధినేత రామ్ వీరపనేనికి కోట్లలో ఆస్తులు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో మాంగో మ్యూజిక్ కు సునీత ఉపద్రష్ట ఎన్నో పాటలు పాడారు. సునీత మరియు రామ్ ల స్నేహానికి అక్కడే బీజం పడిందట. ఈయనతో పరిచయం ముందు స్నేహంగా మారి కొన్ని సంవత్సరాలకి తన పిల్లల కోసం ఆయనని పెళ్లి చేసుకుంది.
రామ్ వీరపనేని ఆస్ట్రేలియాలోనే తన చదువుని పూర్తిచేసి ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చి ఇక్కడే వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఈయనకు కొన్ని ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. మొదటి నుంచి కూడా రామ్ వీరపనేని సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చారు.