NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Trending Stocks: హెరిటేజ్ స్టాక్ పై చంద్రబాబు అరెస్టు ప్రభావం .. రెండు రోజుల్లో ఎంత శాతం తగ్గిందంటే ..?

Advertisements
Share

Trending Stocks Heritage Foods:  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. హైడ్రామా నడుమ ఆయనను ఏపీ సీఐడీ అధికారులు శనివారం నాడు నంద్యాలలో అరెస్టు చేయగా, ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisements

చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా ఇరుపక్షాల వాదనలు జరిగినా సీఐడీ వాదనలకు ఏకీభవిస్తూ న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత అరెస్టు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. టీడీపీ శ్రేణుల నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలు లో పెట్టింది.

Advertisements

Trending Stocks: హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ పై

అయితే చంద్రబాబు అరెస్టు ప్రభావం ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ పై పడింది. ఇన్వెస్టర్ లు షేర్లు ను విక్రయిస్తున్న నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో 11 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం రూ.223.35 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఒక్క రోజే ఆరు శాతానికిపైగా పడిపోగా మంగళవారానికి అది 11.78 శాతానికి పడిపోయింది. రెండు రోజులుగా స్టాక్ పడిపోతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షేర్లను కొనుగోలు చేయాలా..? వద్దా అనే సందిగ్దంలో ఇన్వెస్టర్ లు ఉన్నారు. మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉండవచ్చని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ntr reaction on chandrababu arrest

చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ ను 1992 లో ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా లోకేష్ సతీమణి బ్రహ్మణి లు ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ వాల్యూ 2.37 ట్రిలియన్ కోట్లుగా ఉండగా, సంస్థలో సుమారు 3 వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ.287.35గా ఉండగా.. కనిష్ట విలువ రూ. 135.15 గా ఉంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ ఎంటర్‌ప్రైజెస్‌ లో హెరిటేజ్ ఫుడ్స్ ఒకటిగా ఉంది.

Breaking: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరో సారి చుక్కెదురు .. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ


Share
Advertisements

Related posts

UP Elections 2022: యూపిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య చివరి విడత పోలింగ్

somaraju sharma

Nagachaithanya Samantha: ఫస్ట్ టైం నాగచైతన్యతో విడాకుల గురించి నోరువిప్పిన సమంత..??

sekhar

Makhana: వెయిట్ లాస్ తో పాటు అందం కూడా కావాలా..!? స్నాక్స్ గా దీన్ని తినండి..!!

bharani jella