Categories: న్యూస్

Trending viral: పరిమళించిన మానవత్వం.. ఆవు కోసం వ్యక్తి సాహసం

Share

Trending viral:  ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది తగ్గిపోయింది. పూర్వం ఇంటికి ఎవరైనా అతిథి వచ్చి భోజనం చేయనిదే ఇంట్లోని వారు ముద్ద ముట్టే వారు కాదని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పరోపకారం మాట అటుంచితే ప్రాణాలు పోతున్నా తోటి మనిషిని అలాగే వదిలేసి వెళ్లిపోతున్నారు. కొందరు సోషల్ మీడియా మాయలో పడి, ఓ వ్యక్తి నడిరోడ్డుపై ప్రాణాపాయంతో ఉంటే మిగిలిన వారు దానిని వీడియో తీస్తూ వినోదం పొందుతున్నారు.

అవతలి వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి ముందుకు రాకుండా సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల కోసం తహతహలాడిపోతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ప్రమాదంలో ఉన్న ఆవును కాపాడేందుకు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Trending viral : ఆవుకు ప్రాణాలను రక్షించాలని..

పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా పట్టణం జిల్లా కేంద్రం. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడ పట్టణంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ ఆవు అక్కడి విద్యుత్ స్తంభాన్ని పొరపాటున తాకింది. దీంతో విద్యుత్ షాక్ కొట్టి విలవిలలాడిపోయింది. చివరికి అక్కడి నీటిలోనే స్పృహ తప్పి పడిపోయింది.

వీడియో వైరల్..

ఈ ఘటనను సమీపంలోని ఓ వ్యాపారి చూశాడు. వెంటనే తేరుకుని అక్కడకు వెళ్లాడు. ఆవు విద్యుత్ స్తంభానికి దగ్గరలోనే ఉండడంతో మరోసారి షాక్ కొట్టే ప్రమాదం ఉందని గ్రహించాడు. వెంటనే ఓ గుడ్డను దాని కాళ్లకు కట్టి వెనక్కి లాగాడు. అతడికి మరో ఇద్దరు కూడా సహకరించారు. కాసేపటికి తేరుకున్న ఆ ఆవు ప్రాణాలు దక్కించుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పెట్టడంతో విషయం వైరల్ అయింది. ఆవు కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టి కాపాడావంటూ పలువురు నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

3 seconds ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

51 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

60 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago