Uppena : థియేటర్లలోకి రాబోయే సినిమాలలో ‘ఉప్పెన’ సినిమాకి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఏ సినిమాకి లేదనే చెప్పాలి. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం లో హీరో హీరోయిన్లు ఆరంగ్రేటం చేస్తున్న వాళ్ళు కావడం విశేషం. అయినప్పటికీ బడ్జెట్ విషయం లో మాత్రం ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఎక్కడా తగ్గలేదు. విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ చేత విలన్ పాత్ర చేయించారు. అతను కూడా స్టోరీ విన్న రెండు నిమిషాలకే సినిమా ఒప్పేసుకున్నాడు. దీంతో కథ లో ఎంత దమ్ముందో అర్థం అవుతుంది.
ఇప్పటికే విడుదలైన పాటలు భారీ హిట్ లు గా నిలిచాయి. ట్రైలర్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చింది. పేదింటి కుర్రాడు పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడితే ఆ అమ్మాయి ఇంట్లో వారు రాక్షసత్వాన్ని చూపించడం… జంటా మాత్ర వారి ప్రేమ కొరకు ఎదురు నిలిచి పోరాడడం…. ఇలా తెలిసిన ఫార్మాట్ లోనే సినిమా నడుస్తున్నట్లు కనిపిస్తుంది కానీ కథను చెప్పే క్రమంలో దర్శకుడు కొత్తదనాన్ని చూపించినట్లు ట్రైలర్ లో క్లియర్ గా అర్ధం అవుతుంది. అంతేకాకుండా సుకుమార్ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను రెట్టింపు చేస్తుంది.
ఈ సినిమాపై అందరికీ అన్నీ పాజిటివ్ అంశాలు కనిపిస్తాయి కానీ చాలామందికి ఒక విషయం రుచించడం లేదు. ఈ సినిమాలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి పాత్రకు చెప్పిన డబ్బింగ్ ఎవరికీ నచ్చలేదు. ఈ వాయిస్ సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ ది అని ఎవరైనా చెప్పేస్తారు. అతనిది మంచి వాయిస్ అయినప్పటికీ అది ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. ఇక మనం ట్రైల లోర్ గమనించినట్లైతే విజయ్ సేతుపతి కి పూర్తి మిస్ మ్యాచ్ లాగా ఉంది.
విజయ్ సేతుపతి మనవాళ్లకు బాగా అలవాటు అయిపోయాడు. అతని సినిమాలు భాషా బేధం దాతి తెలుగు వారిని బాగా ఆకట్టుకున్నాయి. అతని వాయిస్ కూడా బాగానే అందరికీ పరిచయం. సైరా సినిమాలో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అయితే విజయ్ సేతుపతి పర్సనాలిటీకి రవిశంకర్ గొంతు ఏమాత్రం పోలిక లేకపోవడం ట్రైలర్ లో కనిపించింది. దీనిపై అనేక పోస్టులు కూడా వచ్చాయి. సినిమాలో విజయ్ సేతుపతి పోషించే పాత్రపైనే ఎక్కువగా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. థియేటర్లో కూడా ప్రేక్షకులు అతని గొంతుకి అడ్జస్ట్ కాలేకపోతే మాత్రం సినిమా రిజల్ట్ పైన ఇది మరింత ప్రభావం చూపేందుకు ఆస్కారం ఉంది.