NewsOrbit
న్యూస్

వామ్మో !’గుడివాడ సెంటిమెంట్’ ఇంత బలమైందా??

రాజకీయాల్లో సెంటిమెంట్లు పెచ్చు! ఉదాహరణకు తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సెంటిమెంట్ ఉంది.1984 ఆగస్టులో ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు.మళ్లీ పదకొండేళ్ల తర్వాత 1995 ఆగస్టులోనే ఆయన పదవీచ్యుతుడయ్యారు!

vammo-is-gudivada-sentiment-so-strong
vammo is gudivada sentiment so strong

ఇలాంటి సెంటిమెంటే మరొకటి గుడివాడకు ఉందట. గుడివాడ నుండి ఎవరు మంత్రి అయినా ఆ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండదట!ఉమ్మడి ఏపీ విడిపోకముందు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే ఈ చరిత్ర సెంటిమెంట్ కొనసాగుతుండడం విశేషం.1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్ ఆసెంటిమెంట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు.

ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదన్న సెంటిమెంట్ అప్పటి నుంచేే మొదలైంది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వం కూలబోతుందా అన్న చర్చ మొదలైంది.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హిందుత్వంపై దాడులు సెగలు రేపుతున్నాయి. హిందువులపై నోరుపారేసుకొని దేవుళ్లు, ఆలయాలపై పరుష వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా ‘గుడివాడ’ నుంచే కావడం గమనార్హం. ‘హిందుత్వంపై ఏపీలో దాడులు’ వైసీపీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కావచ్చు కదా అన్న  అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీ, హిందుత్వవాదుల సెగలతో ఏపీ మంత్రి కొడాలి నాని సీటుకే ఎసరు వచ్చేలా ఉంది. ఆ సెగ ఏపీ ప్రభుత్వానికి కూడా తగిలే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మెడకు ఉన్న కేసులు బీజేపీ తలుచుకుంటే ఉచ్చు బిగించి ఆయనను జైలుకు పంపొచ్చు. అదే జరిగితే ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద విషయం కాదంటున్నారు విశ్లేషకులు. బీజేపీ ఎదురుతిరిగితే జగన్ తట్టుకునే అవకాశాలు లేవంటున్నారు. పరిస్థితి అనుకూలించినప్పుడు ఎంత ఘనమైన మెజార్టీ ఉన్నప్పటికీ సీఎంలు తట్టుకోలేరని చెప్పవచ్చు.1995లో ఎన్టీఆర్ పదవీచ్యుతుడైనపుడు ఆయనకు శాసనసభలో రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులకు గాను రెండు వందల పదిహేను మంది సభ్యులు ఉండేవారు .ఇప్పుడు జగన్ కి కూడా 175 మందికి గాను 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ .పరిస్థితి తిరగబడితే ఆయన పదవికే ఎసరు వచ్చినా ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు మొత్తానికి ఇప్పుడు’ గుడివాడ సెంటిమెంట్ ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju