యునైటెడ్ స్టేట్స్ లోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి విమాన సిబ్బంది అత్యంత మూర్ఖంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోని చుసిన వేలాది మంది ఆ ఎయిర్ లైన్స్ సిబ్బంది వైఖరిపై కామెంట్ల రూపంలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు అక్కడ ఎం జరిగిందంటే… యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు ఎలిజ్ అర్భన్ అనే యువతి, తన భర్త, రెండు సంవత్సరాల బిడ్డతో కలిసి విమానం ఎక్కారు.
విమానం ఎక్కిన తరువాత తాము అత్యంత అవమానానికి గురి అయ్యామని, సిబ్బంది ఏ మాత్రం కనికరం లేకుండా తమను బలవంతంగా విమానం నుంచి దించేశారని మరియు ఇంక ఎప్పటికి వారి ఫామిలీ యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకుండా నిషేధం విధించారని ఎలిజ్ కన్నీరు పెట్టుకుంటూ విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.
కరోనా నేపథ్యంలో విమానంలో ప్రయాణించేటపుడు మాస్క్ తప్పనిసరి అన్న నిబంధన ఉన్నందువలన, ఆ రెండేళ్ల పాప వాళ్ళ నాన్న ఎంత బలవంతం చేసినా తనకు మాస్క్ వద్దని మారాం చెయ్యడంతో విమానం సిబ్బంది ఒకరు వచ్చి, పాపను తీసుకుని వెంటనే కిందకు దిగాలని సూచించాడు.
పాప ముఖాన్ని మాస్క్ తో కవర్ చేశా అని కాసేపట్లో పాప సర్దుకుంటుందని వారికి పాప తండ్రి చెప్పాడు కానీ విమానం సిబ్బంది వినలేదు. విమాన సిబ్బంది బలవంతం చేయడంతో చివరకు ఆ ఫామిలీ మొత్తం విమానం నుంచి కిందకు దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన మొత్తం వీడియో తీశారు అక్కడి ప్రజలు. ఆ వీడియో చుసిన చాలా మంది యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ పై మండిపడుతున్నారు.