NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mango leaves: హిందువులు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

Why Hindus use mango leaves

Mango leaves: నూతన గృహంలోకి ప్రవేశించే ముందు మామిడి తోరణాలను గుమ్మానికి కడుతూ ఉంటారు. అలాగే పండగల సమయంలో కూడా మామిడి తోరణాలను గుమ్మానికి కడతారు. కొందరు మామిడి ఆకుల ప్రయోజనం తెలియకుండానే వాటిని దగ్గర దగ్గరగా కట్టి ఇంటి గుమ్మంకి తోరణాలుగా కడుతూ ఉంటారు. నిజానికి తెలిసి చేసినా తెలియక చేసినా మన హిందూ సంప్రదాయాలను ఆచరించడం వలన మేలే జరుగుతుంది.

Why Hindus use mango leaves
Why Hindus use mango leaves

గృహప్రవేశ సమయంలో కూడా గుమ్మలకి ఎక్కువగా మామిడి తోరణాలను కడుతూ ఉంటారు. కొత్త పాత్రలో పాలు పొంగిస్తారు. ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పాలు పొంగి నేల పైకి దొర్లడం గృహప్రవేశ సమయంలో ఎంతో శుభసూచకంగా చెప్పబడినది.

గృహప్రవేశ కార్యం జరుగుతున్న ఇంట్లోకి మామిడి తోరణాలు కళకళలాడుతూ అతిధులకు స్వాగతం పలుకుతున్నాయా అన్నట్లు ఉంటాయి. ఈ ఆచారం వెనుక ఓ శాస్త్రీయ అంశం దాగి ఉంది. మన పూర్వికులు ఈ విషయాన్నీ గ్రహించారు కాబట్టే  అనేక శుభకార్యాలలో మామిడి ఆకులను వాడేవారు.

గృహప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు మన ఇంటికి వస్తు ఉంటారు. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితం అవుతుంది. అయితే మామిడాకులకు సహజంగానే గాలిని శుద్ధిచేసే గుణం ఉండడం కారణంగా తోరణాలను ద్వారాలకు దట్టంగా కట్టడం జరుగుతుంది.

మామిడాకులకు మన పళ్లలోని సూక్ష్మక్రిములను హరించే సామర్ధ్యం ఉన్న కారణంగా మన పూర్వికులు మామిడి ఆకులను పళ్ళు తోమడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. బావిలోనికి దిగి శుభ్రం చేసేవారికి మొదట ఓ మామిడాకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి, చుట్టూ కొంతసేపు తిప్పమని చెప్పేవారు.

ఇలా చేయడం వలన బావిలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయి. ఇప్పటికి ఇలా చేసేవారు మనకి మన గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju