NewsOrbit
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

చివరాఖరి స్కెచ్ తో జగన్ మీద జూలు విదిల్చిన ఆ వ‌ర్గం మీడియా?

ABN RK: Trying for Sympathy Share in AP Politics

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలో… ఓ వ‌ర్గం మీడియా ఎప్పుడు వ్య‌తిరేక దోర‌ణితోనే ఉంటుంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల్లో, విశ్లేష‌కుల్లో ఉన్న మాట‌.

కొంద‌రు వైసీపీ నేత‌లైతే అయితే స‌ద‌రు సంస్థ‌ల పేరు పెట్టి మ‌రి విమ‌ర్శిస్తుంటారు. అయితే, స‌ద‌రు మీడియా సంస్థ‌లు త‌మ‌కు అలాంటి దురుద్దేశాలు లేవ‌ని క్లారిటీ ఇస్తుంటాయి. కానీ తాజాగా వెలువ‌డిన ఓ క‌థ‌నం వైసీపీ స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌కు ఉన్న భావ‌న‌ను స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని వైసీపీ సానుభూతి వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

బీసీల సంక్షేమం ఎజెండాలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
వివిధ బీసీ కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మొత్తం 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 30వేల పైబడి జనాభా ఉన్నవాందరికీ కార్పొరేషన్లను వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లలో పురుషులు కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్ పదవులు కట్టబెట్టారు. ఇక, డైరెక్టర్ల పదవుల్లో మహిళలకు 50 శాతం కోటా.. ఛైర్మన్‌ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పింరు. అలాగే, డైరెక్టర్ల పదవుల్లోనూ వీలైనన్ని జిల్లాలకు కేటాయించారు.

ఆ మీడియా ఏం రాసిందంటే..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కార్పొరేషన్లు ఓ కొలిక్కి వచ్చి, పాలక మండళ్ల ఎంపిక పూర్తయిన త‌రుణంలో కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌చురించిన క‌థ‌నాల‌పై వైసీపీ సానుభూతిప‌రులు మండిప‌డుతున్నారు. ఈ కార్పొరేష‌న్ల వ‌ల్ల బీసీల‌కు ఒరిగే ప్ర‌యోజ‌నం ఏంట‌నే రీతిలో స‌ద‌రు మీడియా సంస్థ‌లు వార్త‌లు రాశాయి. దీనిపై వైసీపీ వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు ఏలూరులో భారీ ఎత్తున బీసీ స‌భ పెట్టిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌ల‌హీన వ‌ర్గాల కోసం, వెనుక‌బ‌డిన కులాల ఆర్థిక ప‌రిస్థితులు మెరుగుప‌రిచే విధంగా త‌న‌కు అవ‌కాశం ద‌క్కితే కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని ఆ ప్ర‌కారం 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశార‌ని అంటున్నారు.

జ‌గ‌న్ సంచ‌ల‌నం… బాబుకు దెబ్బ‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నమైన‌దేన‌ని అంటున్నారు. బీసీలకు సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వారి రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం అన్ని నామినేటెడ్ ప‌ద‌వుల్లో అంటే.. దేవాల‌యాల ట్ర‌స్ట్ బోర్డులు గానీ, మార్కెట్ యార్డ్ క‌మిటీలు గానీ, త‌దిత‌ర కార్పొరేష‌న్ ల‌లో గానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు 50శాతం అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని మాట ఇచ్చిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాని ప్ర‌కారం చట్టం చేశారు. దానికి కొన‌సాగింపుగా బీసీల్లో మొత్తం 139 కులాలు ఉంటే.. 56 కులాల‌కు కార్పొరేష‌న్లు అవ‌స‌రమ‌ని నిర్థారించి, ఆయా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మ‌న్ల‌ల‌ను నియ‌మించి, క‌మిటీల‌ను నియమించి, వారి తాలుక అభిప్రాయాల‌ను, ఆర్థిక అభ్యున్న‌తికి, వారి విద్యా, సంస్కృతి వ్య‌వ‌హార‌ల‌న్నింటిలో కూడా మెరుగుప‌డే విధంగా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల‌ తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉన్న బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గ‌గ్గోలు పెడుతూ, బీసీల మ‌నోభావాల‌న మార్చేలా వార్త‌లు రాస్తోంద‌ని విరుచుకుప‌డ‌తున్నారు. ఇలాంటి వార్త‌లు స‌ద‌రు మీడియా సంస్థ‌ల విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ తీస్తాయి త‌ప్ప త‌మ‌కు జ‌రిగే న‌ష్టం ఏం ఉండ‌ద‌ని చెప్తున్నారు.

author avatar
sridhar

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?