మనిషి రక్తం రుచి మరిగిన పులిని maneater అంటారు
డబ్బు రుచి మరిగిన మనిషిని moneyeater అంటారు
ప్రస్తుతం మనం అలాగే ఉన్నావు
తండ్రి కొడుకులు ఇద్దరు తాగుబోతులు
తండ్రికి పెన్షన్ వస్తుంది కొడుక్కి ఏవీలేదు మరి వాడి తాగుడుకు డబ్బు ఎలా
తండ్రిని చంపేస్తే ఆ పెన్షన్ తల్లికి వస్తుంది ఐతే సగవే వస్తుంది
ఆవిడ దగ్గర తీసుకోవచ్చు
తండ్రిని చంపడానికి ప్లాన్ వేసేడు
అసలు కొస మెరుపు దీనికి తల్లి చెల్లి సాయం చేసేరు
యెంత దుర్మార్గం
ఆ చెల్లికేం బుద్ధిలేదు
బయోకెమిస్ట్రీ చదివించిన తండ్రిని చంపేస్తుందా
ఆ చదువు ఇందుకు పనికొచ్చిందా నువ్వు కూతురువేనా
ఏదయినా ఉద్యోగం చేసుకోవచ్చు కదా
ఆ తల్లి ఆడదేనా కట్టుకున్నవాడిని చంపేస్తుందా
రేపు నిన్ను చంపరన్న గ్యారంటీ ఏవిటి
మీ బతుకులు చెడ
మీరు కిరాతకులకంటే హీనం
ఆఫ్రికాలో అడవుల్లో అఘోరీలని ఒక జాతి ఉంది
వాళ్ళు మనుషుల్ని చంపి తింటారు
మీరు వాళ్ళ వారసులా
దీనికి మూలకారణం ఒకటి తాగుడు రెండు డబ్బు
తాగుడు వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూఉంటే ఎవరూ ఎందుకు పట్టించుకోరు
సమాజం బాగుపడాలని కోరుకొనేవాళ్ళు లేరా, ఉన్నా వాళ్ళకి పట్టదా
ఈవార్త చదివితే నాకు అన్నం సహించలేదు ఓ రకమైన జుగుప్స
మరి ఆతల్లి కూతుళ్లు అన్నిరోజులు ఎలాఉన్నారో
ఈ వారం మూడు హత్యలు జరిగేయి
అన్నిటా ఆడదాని వాటా ఉంది
ఒకావిడ సవితి కూతుర్ని చంపేసింది
మరొకావిడ అత్తగారిని చంపేసింది
ఇద్దరిదీ స్వార్ధవే అంటే ఆడ హంతకులు కూడా ఉన్నారన్నమాట
అసలు ఆడది అంటే ఓర్పు దయ జాలి అభిమానం ఇవన్నీ ఉండాలి
మరి వీళ్ళు ఆడజన్మ ఎత్తలేదా
మనిషి ఇంత దుర్మార్గంగా ఎందుకు మారిపోతున్నాడు
అయ్యా సంఘసంస్కర్తలూ కొంచెం ఆలోచించండి
కారణాలు వెతకండి
పరిష్కారం చూపించండి
రాబోయే తరాలు నాశనం అవకుండా ఆపండి
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ