NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు : వైసీపీ నీ జగన్ నీ ఇరకాటం లో పెట్టే కొత్త కీలక సాక్ష్యం ? 

ఏపీ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మేటర్ హైకోర్టు దాకా వెళ్లడంతో పాటు కేంద్ర హోం శాఖకు కూడా చేరింది. అదేరీతిలో ప్రధాని మోడీ కి చంద్రబాబు లేఖ రాశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు కి లెటర్ రాసి అసలు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తారా అని కోరడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా హోం మంత్రి సుచరిత మీడియా సమావేశం పెట్టి ఇదంతా అబద్ధం అని, పొలిటికల్ గేమ్ అని ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కొట్టిపారేశారు.

TDP, Phone tappingపై టీడీపీ నేత బుద్ధా ...పరిస్థితి ఇలా ఉండగా టిడిపి సరికొత్త విషయాలు బయట పెట్టింది. టిడిపి నేత బుద్ధ వెంకన్న గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇజ్రాయేల్ టెక్నాలజీ తో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లు ఆధారాలతో పాటు నిరూపించటం జరిగింది అని అప్పట్లో మీరే అన్నారు. అవి ఎక్కడ అని తిరిగి ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయం పై వైవీ సుబ్బారెడ్డి కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే, వై.వి.సుబ్బారెడ్డి వేసిన కేసు వెనక్కి ఎందుకు తీసుకున్నారు. దమ్ముంటే అప్పట్లో చేసిన ఆరోపణలు ఇప్పుడు నిరూపించండి. ఎందుకు నిరూపించలేక పోతున్నారు? కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

 

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హోంమంత్రి సుచరిత అసత్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. మొత్తంమీద చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో బుద్ధా వెంకన్న సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చి వైసీపీని, జగన్ ని ఇరకాటంలో పెట్టే సరికొత్త టాపిక్ తెరపైకి తీసుకురావడం ఆసక్తి కరంగా మారింది. గతంలో వై.వి.సుబ్బారెడ్డి చంద్రబాబు ప్రభుత్వం పై ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేసిన కేసుని సాక్ష్యంగా తీసుకుని బుద్ధా వెంకన్న వ్యవహరించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనం అయ్యింది. మరోపక్క హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్ పిల్ వేయడంతో న్యాయస్థానం విచారణ చేపట్టడంతో… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో చివరాఖరికి ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది. 

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju