(న్యూస్ అర్బిట్ డెస్క్)
విజయవాడ: టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై కేసు నమోదు అయ్యింది. సోమవారం గృహ నిర్బంధం సందర్భంగా పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో ఐపిసి 353 సెక్షన్ కింద ఆయనపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
బొండా ఉమాపై తప్పుడు కేసు నమోదు చేశారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో బొండా ఉమ తన నివాసం నుండి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బొండా ఉమా, ఓ పోలీసు అధికారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.